Big Stories

Eruvaka Pournami : ఏరువాక పౌర్ణమి రోజు మర్రిచెట్టును పూజిస్తే….

Eruvaka Pournami : హిందూ మతంలో కొన్ని మొక్కలను దైవ వృక్షాలుగా భావిస్తుంటారు. వృక్షాలని దేవతలుగా భావించి భక్తితో పూజిస్తారు. అలా పూజలు అందుకునే చెట్లలో మర్రిచెట్టు కూడా ఒకటి. దీనినే వటవృక్షం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక పరంగా మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. ఏరువాక పౌర్ణమి రోజు మర్రిచెట్టుకి పూజ చేయడం మహిళలకు మంచిదని శాస్త్రం చెబుతోంది. మరిచెట్టు మొదట్లో శుభ్రం చేసి ముగ్గు వేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో వేస్తూ మంత్రాన్ని జపిస్తూ పూజను చేయాలి. తర్వాత ఎరుపు , పసుపు రంగుల దారాలను కట్టాలి. మర్రిచెట్టుకి నీళ్లు పోసి ఐదు ప్రదక్షణలు చేస్తూ ఓం వటసావిత్రైనమః అని జపించాలి. తర్వాత మర్రిచెట్టుకి హారతి ఇచ్చి నైవేద్యం తీసుకుని ..చీర లేదా రవిక ఐదుగురు ముత్తయిదవులకి ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటే వారు కోరుకున్న కోరికలు ఫలిస్తాయి.. ఏరువాక పౌర్ణమి రోజు వటసాయి వ్రతం పేరుతో ఇలా పూజను ఆచరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కుటుంబంలోని అందరికి భోగ భాగ్యాలు కలుగుతాయని స్కాందపురాణంలో ఉంది.

- Advertisement -

హైదరాబాద్ లాంటి నగరాల్లో మర్రిచెట్టులు ఉండవు. అలాంటి పరిస్థితుల్లోను ఇంట్లో పూజ చేసుకోవచ్చు. పసుపు ముద్దని చేసి మర్రిచెట్టుగా భావించి వటసాయి మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోవచ్చు. ఏరువాక పౌర్ణమి రోజు గంధం దానమిచ్చినా…విసనకర్ర దాన మిచ్చినా ఆర్ధిక కష్టాల నుంచి బయటపడతారని శాస్త్రం చెబుతోంది.వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మర్రిచెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగి మానసిక ఒత్తిడి పోతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని అనుమానం ఉన్న గుడి దగ్గర మాత్రమే ఉండే మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News