Big Stories

Ashika Ranganath: మరో స్టార్ హీరోకి జోడీగా లక్కీఛాన్స్.. ఆషికా ఏదో తొక్కింది భయ్యా..

Ashika Ranganath: కన్నడ అందం ఆషికా రంగనాథ్.. కళ్యాణ్ రామ్‌తో ‘అమిగోస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఫిదా చేసింది.

- Advertisement -

- Advertisement -

ఈ ఏడాది నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో నటించి మరింత అందంగా మెరుస్తూ కుర్రకారును కట్టిపడేసింది.

అయితే అందం, యాక్టింగ్‌తో ఆకట్టుకున్నా.. ఈ అందాల ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు కరువయ్యాయనే చెప్పాలి.

ఇటీవల ఈ కన్నడ బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’లో నటించే అద్భుత అవకాశం వరించింది.

అయితే ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఇప్పుడు ఆషికాకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు కన్నడలో ఏకంగా మూడు సినిమాలు చేస్తుంది.

ఇక ఇప్పుడు మరొక భాషలో నటించేందుకు సైన్ చేసింది. తమిళంలో ఓ భారీ ఆఫర్‌ని దక్కించుకుంది.

కోలీవుడ్ హీరో కార్తీ నటించిన ‘సర్దార్’ తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ సిద్ధమవుతోంది.

ఈ చిత్రాన్ని దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌ను సెలెక్ట్ చేసుకున్నారు.

ఇక ఈ మూవీతో పాటు ఆషిక మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నటుడు సిద్ధార్థ్ హీరోగా చేస్తున్న ‘మిస్ యు’ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

మరి ఈ చిత్రాలు మంచి విజయాలు సాధిస్తే.. ఈ అమ్మడుకి తిరుగులేదనే చెప్పాలి. దీంతో ఈ విషయం తెలిసి నెటిజన్లు.. ఆషికా ఏదో తొక్కింది భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News