Big Stories

RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో భేటీ కానున్న యోగి.. ‘గాలి బుడగ’ పై చర్చించే అవకాశం

RSS Chief: జూన్ 15న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశం కానున్నారు. వీరి మధ్య లోక్ సభ ఎన్నికల ఫలితాలు, యూపీలో ఆర్ఎస్ఎస్ విస్తరణతోపాటు పలు అంశాలపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడని, ఇతరులకు ఎలాంటి హానిని కలిగించకుండా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాడని ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఈ భేటీ విషయమై చర్చ కొనసాగుతున్నది.

- Advertisement -

ఇటు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 240 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అత్యంత కీలకమైన రాష్ట్రం యూపీలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 80 స్థానాలకు గానూ 33 సీట్లను మాత్రమే సొంతం చేసుకుంది. 2019లో ఆ సంఖ్య 62గా ఉంది. ఇదే యూపీలో ఇండియా కూటమికి 43 సీట్లు వచ్చాయి. ఈ ఫలితాల తరువాత ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ లో ఒక వ్యాసం ప్రచురితమయ్యింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని, వీరితోపాటు నేతలంతా ‘గాలి బుడగ’ను నమ్మకుని పని చేశారని, మోదీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదంటూ ఆ వ్యాసం పేర్కొన్న విషయం తెలిసిందే.

‘ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 400కు పైగా సీట్లను కైవసం చేసుకుంటామనే లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు, కార్యకర్తలు భావించారు. మోదీ ఇమేజ్ తో గెలుస్తామనే నమ్మకంతో వారు పని చేయలేదు. స్థానిక నాయకులను తక్కువ చేసి చూడడం, పార్టీ ఫిరాయించిన వారికే టికెట్లు ఇవ్వడం, బాగా పనిచేసిన పార్లమెంటు సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించింది. మహారాష్ట్రలో పార్టీలను చీల్చడం వంటి అనవసర రాజకీయాలు కూడా పార్టీని దెబ్బతీశాయి’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

Also Read: ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా.. ఎందుకో తెలుసా?

ఇందుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ‘ మొదటగా భక్తి చూపించి, ఆ తరువాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 దగ్గర ఆగిపోయింది. రాముడిని వ్యతిరేకించినవారు 234 వద్ద మాత్రమే ఆగిపోయారు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News