Big Stories

Central Budget 2024 : కేంద్ర బడ్జెట్‌.. మధ్య తరగతి జీవులకు దక్కే ఊరటలేంటి ?

Central Budget 2024 : కేంద్ర బడ్జెట్‌.. దేశం మొత్తం ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తున్న అంశం. ధరల భారం తగ్గుతుందా..? పన్ను మినహాయింపులు ఉంటాయా..? మధ్య తరగతి జీవులకు దక్కే ఊరటలేంటి? సంచలన నిర్ణయాలు ఏమైనా ఉండబోతున్నాయా? ఇప్పటికే ఇలాంటి ప్రశ్నలతో ప్రజలంతా సతమతమవుతున్నారు. ఇప్పుడు వారి అంచనాలు మరింత పెంచేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇంతకీ బడ్జెట్‌కు సంబంధించి ఆమె ఏం చెప్పారు? మీరే వినేయండి.

- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏం చెబుతున్నారు? కొత్త ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో భారీ ఆర్థిక, సామాజిక నిర్ణయాలు ఉండబోతున్నాయి. అంతేకాదు కొన్ని చారిత్రాత్మక చర్యలు కూడా తీసుకోబోతున్నారని ప్రకటించేశారు. ప్రభుత్వం అనుసరించిన సంస్కరణల కారణంగా పదేళ్లలో 11 నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా కృషి చేయబోతున్నాం. ఇవీ ముర్ము గారి మాటలు. అంటే రాబోయే బడ్జెట్‌లో కొన్ని సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇంతకీ ప్రజలు కేంద్రం నుంచి ఏం ఆశిస్తున్నారు ?

- Advertisement -

ముఖ్యంగా మూడు రంగాల నుంచి ఫైనాన్స్‌ మినిస్టర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. మొదటిది MSME, రెండోది వ్యవసాయ రంగం. మూడోవది ఎగుమతులు. ముందుగా రైతుల నుంచి మొదలుపెడదాం. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వ్యవసాయ పరిశోధనలు, ఎరువులకు రాయితీలు, మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడం. అత్యంత ముఖ్యమైనది. వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు భారీగా నిధులను కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రైతు సంఘాల నేతలు, నిపుణులతో కూడా చర్చించారు. ఇందులో మెయిన్‌గా వారు చేసిన డిమాండ్ ఏంటంటే ఇండియనన్ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్ రీసెర్చ్‌కు బడ్జెట్‌ను 9 వేల కోట్ల నుంచి 20 వేల కోట్లకు పెంచాలని. నిజంగా ఇది ప్రస్తుతం చాలా అవసరం.

Also Read : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. కొత్త పదవితో పెరిగిన బాధ్యతలు

ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో.. ఎప్పుడు భానుడి భగభగలు పెరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. కాబట్టి.. వీటన్నింటినీ తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తమకు అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాలన్నది MSME రంగాల వారి డిమాండ్. ఆర్థిక సాయం పొందడంలో ఇబ్బందులను తొలగించాలి. 45 రోజుల పేమెంట్ రూల్ మార్చాలి. ఇంటర్నేషనల్ ట్రేడ్, డిజాస్టర్ సపోర్ట్ మెకానిజం ఏర్పాటు చేయడం. ఇన్సెంటివ్వ్ ఇవ్వడం.. ఇలా అనేక డిమాండ్స్ వస్తున్నాయి. ఇక ఎగుమతుల రంగానికి చెందిన వారు కూడా అనేక డిమాండ్స్‌ కేంద్రం ముందు ఉంచారు. ఎగుమతుల విషయంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

2030 నాటికి దేశ ఎగుమతులను 2 ట్రిలియన్ డాలర్లకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అంతేకాదు ప్రీ, పోస్ట్ షిప్‌మెంట్‌పై సబ్సిడీలను అందించే ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్‌ స్కీమ్ గడువును పెంచాలని కోరుతున్నారు. మరి వీటిపై కేంద్రం ఎలా స్పందిస్తుంది. ఎలాంటి కేటాయింపులు చేస్తుందో చూడాలి. ఆరోగ్యం, రక్షణ.. ఇలా అనేక రంగాలకు కేటాయింపులు ఎలా ఉంటాయి. కానీ దేశానికి వెన్నెముక లాంటి మధ్య తరగతికి ఎలాంటి ఉపశమనం ఉండబోతుంది? అనేది  ఇక్కడ ప్రధాన ప్రశ్న.

పన్ను కట్టే మధ్య తరగతి ప్రజలంతా తమకు కాస్త వెసులు బాటు కల్పించాలని కోరుతున్నారు. అయితే కాస్త ఉపశమనం ఉండబోతుందని తెలుస్తోంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది. అంటే పాత పన్ను విధానంలో మార్పులు చేస్తారని కాదు. అందులో ఎలాంటి మార్పులు చేసే అవకాశమైతే కనిపించడం లేదు. ఇప్పటికే ధరలు పెరగడం, హాస్పిటల్ ఖర్చులు, పిల్లలను చదివించేందుకు చేసే ఖర్చులు చేస్తుండటంతో తడిసి మోపెడవుతుంది. అందుకే తమకు పన్ను మినహాయింపు కావాలంటున్నారు.

Also Read : రాష్ట్రపతి ప్రసంగం.. పేపర్ లీక్‌లు, ఆప్ ఎంపీలు దూరం

ఇంతకీ ఏంటి ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ పంచాయితీ అనే కదా మీ అనుమానం. 2023లో బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ తీసుకొచ్చింది కేంద్రం. దీంతో టాక్స్ పేయర్స్ ఎలాంటి ఆధారాలు సమర్పించకుండానే రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఇది కొత్త పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం రూ.7 లక్షల లోపు ఆదాయం గల వారుఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాగూ రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి ఏడున్నర లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం నుంచి రిలాక్సేషన్ ఉంటుంది.

అయితే పాత పన్ను విధానంలో రూ.3 లక్షల ఆదాయం దాటితే 5 శాతం పన్ను ఉంటుంది. కానీ వీరికి చాలా మినహాయింపులు ఉంటాయి. కాబట్టి పన్ను భారం తక్కువే పడుతుంది. కానీ కొత్త పన్ను విధానంలో ఇలాంటి మినహాయింపులు లేవు. అందుకే మిడిల్ క్లాస్ట్ వారంతా పన్ను పరిమితిని అయినా పెంచండి లేదా.. స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని కోరుతున్నారు. ఇప్పటికే తినే ఉప్పు, పప్పు.. ఇలా అన్నింటిపై పన్నులు కడుతున్నాం. మళ్లీ మాకీ పన్నుపోటు ఎందుకని వాపోతున్నారు. అందుకే ఏదైనా వెసులుబాటు కల్పించకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి నిర్మలమ్మ మనసు కరుగుతుందా? ఎన్డీఏ సర్కార్‌ వరాల జల్లు కురిపిస్తుందా? లేదా? చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News