BigTV English

Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో వివేక్ రామస్వామి.. ఎవరతను..?

Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో వివేక్ రామస్వామి.. ఎవరతను..?

Vivek Ramaswamy : వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మూడేళ్ల క్రితం అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ పదవీకాలం ఏడాది మాత్రమే ఉంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధుల రేసు మొదలైంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నదానిపై ఉత్కంఠ రేగుతోంది. ఆ పార్టీ తరఫున ఇద్దరు భారత సంతతి అభ్యర్థులు పోటీ పడటం ఆసక్తిని పెంచింది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో నిక్కీహేలీ ఉన్నారు. ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున భారత సంతతికే చెందిన వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థి రేసులోకి వచ్చారు.


ఎవరీ వివేక్ రామస్వామి..?
వివేక్ రామస్వామి తల్లిదండ్రులది కేరళ. వారు ఆ రాష్ట్ర నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే ఆ కుటుంబం స్థిరపడింది. వివేక్ రామస్వామి వయస్సు 37 ఏళ్లు మాత్రమే. 2014లో రోయివాంట్ సైన్సెస్ సంస్థ‌ను నెలకొల్పారు. ఈ ఫార్మ‌సీ కంపెనీ మందులను త‌యారు చేస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఆ ఉత్ప‌త్తుల‌కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మ‌రికొన్ని హెల్త్ కేర్ , టెక్నాల‌జీ కంపెనీల‌ను ఆయ‌న స్థాపించారు. 2022లో స్ట్ర‌యివ్ అసెట్ మేనేజ్ మెంట్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. రాజ‌కీయాల‌పై శిక్షణ ఇచ్చేలా సంస్థ‌ను అభివృద్ధి చేశారు.

తాజాగా ఫాక్స్ న్యూస్ ప్రైమ్ టైమ్ షోలో వివేక్ రామస్వామి కీలక విషయాన్ని ప్రకటించారు. తాను అధ్యక్ష పదవి అభ్యర్థి రేసులో ఉన్నానని చెప్పారు. ఇదే సమయంలో సంచలన కామెంట్స్ చేశారు. 250 ఏళ్లుగా అమెరికాను నడిపిస్తున్న ఆదర్శాలకు ప్రమాదం ఏర్పడిందని అన్నారు. చైనా నుంచి ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ విధానాన్ని మార్చాలని స్పష్టం చేశారు. ఇటీవల చైనా బెలూన్ రేపిన కలకలంపైనా వివేక్ రామస్వామి తన వైఖరిని స్పష్టం చేశారు. ఆ బెలూన్ ర‌ష్యాది అయితే వెంటనే పేల్చి వేసేవాళ్లమని అన్నారు. కానీ చైనా విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నామని ప్రశ్నించారు. చైనాపై ఎక్కువ ఆధార పడటాన్ని తగ్గించుకోవాలని వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు.


నిక్కీ హేలీ ఎవరంటే..?
51 ఏళ్ల నిక్కీ హేలీ కరోలినా రాష్ట్రానికి రెండుసార్లు గవర్నర్‌గా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగానూ పనిచేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని గతేడాదే ప్రకటించారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నిక్కీహేలీ మొదటి పోటీదారుగా నిలిచారు. ఇప్పుడు వివేక్ రామస్వామి పోటీలోకి రావడం ఆసక్తిని రేపుతోంది. మరి రిపబ్లికన్ పార్టీ తరఫున ఎవరు అధ్యక్ష బరిలోకి దిగుతారు? భారత సంతతికి చెందిన ఆ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుంది?

Rahul Gandhi: తనకు పిల్లలు కావాలంటున్న రాహుల్.. మరి, పెళ్లి?

Rahul Gandhi: తనకు పిల్లలు కావాలంటున్న రాహుల్.. మరి, పెళ్లి?

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×