E-Paper
Advertisement

Rahul Gandhi: తనకు పిల్లలు కావాలంటున్న రాహుల్.. మరి, పెళ్లి?

Rahul Gandhi: తనకు పిల్లలు కావాలంటున్న రాహుల్.. మరి, పెళ్లి?
Advertisement

Rahul Gandhi: రాహుల్ గాంధీ. కాంగ్రెస్ యువరాజు. దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రధాని మోదీలా సోలో లైఫే సో బెటర్ అనుకుంటున్నారో ఏమో. 52 ఏళ్లు వచ్చినా ఇం..కా పెళ్లే చేసుకోలేదు. రాహుల్..రాహుల్ పెళ్లెందుకు చేసుకోలేదు? అని అడిగితే.. ఒక్కోసారి ఒక్కో రీజన్ చెబుతుంటారు.లేటెస్ట్‌గా ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. ఆ కోరిక మరింత విచిత్రంగా ఉంది. ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే…

రాహుల్ గాంధీకి పిల్లలు కావాలని ఉందట. అవును, నిజమే. తనకు పిల్లలు ఉంటే బాగుండని తన మనసులోని భావన బయటపెట్టారు రాహుల్ గాంధీ. ఓ ఇటలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు.

Advertisement

మరి, ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే. ఏమో. తనకే తెలీడం లేదని బదులిచ్చారు. ‘ఆ విషయం నాకే విచిత్రంగా ఉంది. వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు’ అని చెప్పారు. చాలా పనులు చేయాల్సి ఉందని అన్నారు రాహుల్.

ఇక నానమ్మ ఇందిరాగాంధీపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. గ్రాండ్ మదర్‌ ఇందిరాగాంధీకి తానంటే ఎంతో ఇష్టమని.. తనకు కూడా ఆమంటే ప్రేమని చెప్పారు. అయితే, ఇటలీలో ఉండే అమ్మమ్మ (సోనియా తల్లి) పావ్‌లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ప్రాణమని అన్నారు రాహుల్ గాంధీ.

Advertisement

ఇక, భారత్ జోడో యాత్రలో బాగా గడ్డం పంచేసిన రాహుల్.. ఇప్పుడు ఆ గడ్డాన్ని ఉంచాలా? తీసేయాలా? అని ఆలోచిస్తున్నారట. ఏదో ఒకటి తాను నిర్ణయించుకోవాల్సి ఉందని అన్నారు.

Mallikarjun Kharge :2024లో కాంగ్రెస్ కూటమిదే అధికారం..ఖర్గే జోస్యం

Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో వివేక్ రామస్వామి.. ఎవరతను..?

Related News

ఇన్‌ఫ్లుయెన్సర్ సూసైడ్.. వేధింపుల వెనుక ఏం జరిగింది? చెన్నైలో ఘటన

మోదీ సర్కార్‌ని కూల్చేందుకు కుట్ర.. దసరా వేళ భగవత్ హాట్ కామెంట్స్, పశ్చిమం నుంచి తుఫాను మొదలు

పెళ్లైన జంట.. భర్త ముందే భార్యపై 8 మంది, బీహార్‌లో షాకింగ్ ఘటన

యూకో బ్యాంక్‌లో జాబ్స్.. మొత్తం 530 ఉద్యోగ ఖాళీలు.. ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఏం జరిగింది.. పారిపోతున్న వ్యక్తిని పట్టేశారు, అసలు గుట్టు బయటకు

కొండ చిలువల తోక పట్టుకుని రీల్స్.. వైరల్ కావడానికి ఏమైనా చేస్తేస్తారా?

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో.. ముగ్గురు నిందితులు అరెస్ట్!

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

Big Stories

Advertisement
×