Big Stories

Siddharth to Marry Girlfriend: పెళ్లి పనుల్లో విజయ్‌మాల్యా, ప్రేయసితో సిద్ధార్థ మ్యారేజ..!

Siddharth to Marry Girlfriend: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశారు ఫేమస్ బిజినెస్‌మేన్ విజయ్‌మాల్యా. ఆయన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తూ వుంది. ఇకవేళ ఇండియా వెళ్తే లండన్‌కు రావడం కష్టమని ఆయన భావించారు. ఈ క్రమంలో తన కొడుకు సిద్దార్థ మాల్యా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారాయన. సిద్ధార్థ్ చిరకాల ప్రేయసి జాస్మిన్‌ను వివాహం చేసుకోనున్నా డు. ఈ వారంలోనే వీరి పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి.

- Advertisement -

మ్యారేజ్ ఎక్కడ జరగనుంది అనేది సస్పెన్స్. ఈ వేడుకకు పలువురు వ్యాపారవేత్తలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియా నుంచి సినీ, రాజకీయ, బిజినెస్‌మేన్లు ఈ మ్యారేజ్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. బంధువుల సమక్షంలో పెళ్లి జరుగుతుందా? లేక డిస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారా అనేది సీక్రెట్.

- Advertisement -

గతేడాది హలోవీన్ సందర్భంగా చిరకాల ప్రేయసి జాస్మిన్‌కు రింగ్ తొడిగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు సిద్దార్థ్. మాల్యాకు కాబోయే కోడలు అమెరికాకు చెందిన వ్యక్తి. అంతేకాదు మాజీ మోడల్‌ కూడా. ఆమె ఫ్యామిలీ డేటేల్స్ గురించి పెద్దగా సమాచారం లేదు. ఇక సిద్దార్థ్ మాల్యా గురించి చెప్పనక్కర్లేదు. మోడల్‌గా అందరికీ పరిచయమే. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో విజయ్ మాల్యా- సమీర త్యాబ్జీ దంపతులకు సిద్ధార్థ్ పుట్టాడు. అమెరికా, లండన్, యూఏఈ, ఇండియాలో పెరిగాడు. లండన్‌లో చదువు పూర్తి చేశాడు.

Also Read: నిజంగా ఈవీఎంలను హ్యక్ చేయవచ్చా? మధ్యలో మస్క్ పంచాయితీ ఏంటీ?

కింగ్‌ఫిషర్ మోడల్స్ జడ్జిగా వ్యవహరించాడు సిద్ధార్థ్. అంతేకాదు నటుడిగా తన లక్‌ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలో పలు పుస్తకాలు రాశాడు. సిద్ధార్థ్ తండ్రి విజయ్‌మాల్యా ప్రస్తుతం యూకె ఉంటున్నాడు. ఆయన్ని ఇండియా రప్పించేందుకు మోదీ సర్కార్ తెగ ప్రయత్నాలు చేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News