Big Stories

NEET PG 2024: నీట్‌ పీజీ నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు

NEET PG 2024: నీట్‌ పీజీ-2024 పరీక్ష నిర్వహణపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లోను, ఇటు అభ్యర్థుల్లోను గందరగోళం నెలకొంది. అయితే తాజాగా ఈ విషయమై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ మేరకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షను రిషెడ్యూల్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ మేరకు నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

కాగా, ఎన్టీఏ( నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)లో ఇప్పటికే కొత్త అధికారులు చేరారు. నీట్ పరీక్షలను నిర్వహించే బాధ్యతలను ఎన్టీఏ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే పేపర్ లీకేజీపై ఆరోపణలు రావడంతో ఎన్టీఏలో అధికారులను మార్పులు చేశారు. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేయగా ఈ మార్పులు చేర్పులు జరిగాయి. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు వెల్లడించారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పరీక్ష నిర్వహణపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ధర్మేంద్ర అన్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీకేజీపై చర్చను కాంగ్రెస్ అడ్డుకుంటుందని అన్నారు. నిందితులను తప్పించాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. అభ్యర్థులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం తరపున తాను ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News