Big Stories

Dharmendra pradhan: విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు: ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra pradhan: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశం నిర్వహించారు. నీట్ పరీక్షతో పాటు యూజీసీ నెట్ పరీక్ష రద్దు విషయాలపై విపక్షాల చేస్తున్న ఆరోపణల గురించి ఆయన మాట్లాడారు. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఆధారాలు లభిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్టీఏలోని ఎవరైనా ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని అన్నారు. దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని కోరారు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు.

- Advertisement -

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు..

విద్యార్థులే మన భవిష్యత్తు.. నీట్ గురించి పుకార్లు వ్యాప్తి చేయవద్దని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రశ్నా పత్రాల లీకేజీకి సంబంధించి పట్నా పోలీసులు పూర్తి స్థాయి నివేదిక అడిగినట్లు వెల్లడించారు. ఎన్టీఏ పరీక్ష విధానం మెరుగుపరిచేందుకు జీరో ఎర్రర్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News