Big Stories

UGC NET New Exam Date: యూజీసీ నెట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ

UGC NET New Exam Date 2024(Today news paper telugu): దేశ వ్యాప్తంగా పేపర్ లీక్ విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేసింది. తాజాగా, యూజీసీ నెట్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను ఎన్టీఏ విడుదల చేసింది.

- Advertisement -

కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను జులై 25 నుంచి 27 మధ్య నిర్వహిస్తుండగా..ఎన్ సెట్ పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది.

- Advertisement -

ఈ ఏడాది జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 పరీక్ష, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్షలను ఆన్ లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాగా, గతంలో ఆఫ్ లైన్ విధానంలో పెన్ను, పేపర్ విధానంలో పరీక్షను నిర్వహించేవారు. తాజాగా, యూజీసీ నెట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్ష 2024ను షెడ్యూల్ ప్రకారమే జులై 6న నిర్వహించనున్నారు.

ఈ ఏడాది జూనియర్ రీసెర్చ్ ఫెల్లో షిప్ నకు అర్హత సాధించేందుకు..విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎన్టీఏ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తర్వాత యూజీసీ నెట్‌లో అక్రమాలు జరిగాయంటూ నివేదిక రావడంతో కేంద్రం ఆ పరీక్షను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 317 నగరాల్లోని 1,205 సెంటర్లలో పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 11 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షను రెండు విడతలుగా నిర్వహించగా.. రెండిటిలో అక్రమాలు జరిగాయని నివేదిక వచ్చింది. దీంతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేస్తూ ప్రకటించింది. అయితే కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. మిగతా సమాచారం కోసం ఎన్టీఐ అధికారిక వెబ్ సైట్ www.nta.ac.inను సంప్రదించాలి

కొత్త షెడ్యూల్ ఇదే..

ఎన్‌సెట్ 2024 పరీక్ష – జులై 10,
జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 పరీక్ష – జులై 25 నుంచి 27,
యూజీసీ నెట్ పరీక్ష – ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News