Big Stories

Pineapple: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

Pineapple: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. పైనాపిల్స్ ను కానుకగా పంపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా మెరుగుపడేలా గౌరవ సూచికంగా ఆమెకు 500 కిలోల ‘క్వీన్ పైనాపిల్స్’ ను పంపారు. అఖుర ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసీపీ) ద్వారా ఈ పండ్లను బంగ్లాదేశ్ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

‘సీఎం ఆదేశాల మేరకు 500 కిలోల ‘క్వీన్ పైనాపిల్స్’ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు పంపాం. 100 ప్యాకెట్లలో ఈ పండ్లను పెట్టి తరలించాము. ఒక్కో ప్యాకెట్ లో 6 పండ్లు, ఒక్కో పండు బరువు వచ్చేసి 750 గ్రాముల చొప్పున ఉంటుంది’ అంటూ త్రిపుర ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దీపక్ తెలిపారు.

- Advertisement -

Also Read: రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ.. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా? అంటూ..

భారత్ – బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని ఆయన తెలిపారు. పరస్పరం గౌరవ భావంతో చేసే ఇలాంటి చర్యల వల్ల సంబంధాలు మరింత బలపడుతాయన్నారు. గతేడాది కూడా త్రిపుర సీఎం మాణిక్ సాహా.. షేక్ హసీనాకు పైనాపిల్స్ పంపించారు. దీంతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమె కూడా తిరిగి మామిడి పండ్లను సీఎంకు పంపించి తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News