Big Stories

Trek Accident: హిమాలయాల్లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 9మంది బెంగళూరు వాసులు మృతి

Trek Accident:ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లిన బృందం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మృతులంతా బెంగళూరు వాసులుగా గుర్తించారు. మొత్తం 22 మందితో కూడిన ట్రెక్కింగ్ బృందం మే 29న హిమాలయాల్లోని 4,400 మీటర్ల ఎత్తున ఉన్న సహస్త్రతాల్ సరస్సు వద్దకు బయలుదేరారు. ట్రెక్కింగ్ పూర్తి చేసుకున్న ఈ బృందం తిరిగి బేస్ క్యాంప్ వద్దకు చేరుకోలేదు. దీంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సమాచారం అందించారు.

- Advertisement -

13మందిని కాపాడారు..

- Advertisement -

ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 22 మందిలో 9 మంది మృతి చెందగా.. ఇప్పటికే చిక్కుకున్న 13మందిని కాపాడారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 19 మంది, మరో ముగ్గురు స్థానిక గైడ్స్‌తో కలిసి ఉత్తరకాశీ నుంచి హిమాలయ పర్వతాల్లోని సహస్త్రతాల్ సరస్సు ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీంతో మాట్లాడుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కాగా, ఇప్పటికే మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News