Big Stories

UGC-NET: పేపర్ లీక్ చేసిన ఛానళ్లను బ్లాక్ చేసిన టెలిగ్రామ్

UGC- NET: యూజీసీ నెట్ పేపర్ లీక్‌పై టెలిగ్రామ్ స్పందించింది. పేపర్ లీక్‌లో పాలు పంచుకున్న ఛానళ్లను బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. అధికారులు చేస్తున్న విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ప్రశ్నా పత్రాలకు సంబంధించిన అనధికార కాపీలను సర్క్యులేట్ చేసిన ఛానళ్లను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు ప్రకటించింది.

- Advertisement -

నీట్ పేపర్ లీక్ వ్యవహారం, అదే సమయంలో నెట్ పరీక్ష రద్దు కావడం వంటి అంశాలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. యూజీసీ నెట్ పరీక్ష మంగళవారం జరగగా పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ఆ వెంటనే ఎన్ క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే దీనిపై టెలిగ్రామ్ కూడా స్పందించింది. పేపర్ లీక్‌తో సంబంధం ఉన్న ఛానళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

Also Read: తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. నీట్ పేపర్ లీకేజీకి కారణం ఆయనే..

పరీక్షా పత్రాలకు సంబంధించిన అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఛానళ్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. దేశ చట్టాలకు లోబడి దర్యాప్తుకు సహకరిస్తామని వెల్లడించింది. లీకేజీ వ్యవహారంలో సోషల్ మీడియా సంస్థలపై విమర్శలు రావడంతో టెలిగ్రామ్ ఈ విధంగా స్పందించింది. లీక్ అయిన ప్రశ్నా పత్రం అసలు పేపర్‌తో సరిపోలిందని ఇప్పటికే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యూజీసీ నెట్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేసథ్యంలోనే నెట్ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను కూడా త్వరలో ప్రకటించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News