Big Stories

UGC NEET 2024 Leak : అవును.. NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు

UGC NEET 2024 Questiin Paper Leak : NEET పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ లో సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు. రూ.30 లక్షలు తీసుకుని ప్రశ్నాపత్రంతోపాటు జవాబులను కూడా అభ్యర్థులకు అందజేసినట్లు పోలీసుల అంగీకారపత్రంలో వెల్లడించాడు. దానాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జేఈ సికిందర్ అనే వ్యక్తితో కలిసి.. నలుగురు వ్యక్తులకు ప్రశ్నాపత్రాన్ని అమ్మినట్లు తెలిపాడు. పోలీసులు అతని ఫ్లాట్ లో ఆన్సర్ పేపర్లు కాలిన గుర్తులను కొనుగొన్నారు.

- Advertisement -

మరోవైపు బిహార్ కు సంబంధించిన అవుట్ డేటెడ్ చెక్కుల్ని ఇచ్చి.. అభ్యర్థులు ప్రశ్నాపత్రాలను పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అరెస్టైన బీహార్ కు చెందిన స్టూడెంట్ అనురాగ్ యాదవ్ ను పోలీసులు విచారించగా.. తనవద్దనున్న లీకేజీ పేపర్ ను అప్పగించాడు. ఒరిజినల్ క్వశ్చన్ పేపర్, అనురాగ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ సేమ్ టు సేమ్ ఉన్నాయి.

- Advertisement -

Also Read : యూజీసీ నెట్ పరీక్ష రద్దు

యూజీసీ నీట్ 2024 ప్రశ్నాపత్రాన్ని జూనియర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న తన అంకుల్.. పరీక్షకు ముందు ఇవ్వడంతో అందుకు తగ్గట్టుగానే రాత్రికి రాత్రి పరీక్షకు ప్రిపేర్ అయినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. మరోవైపు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను తాకింది. ఈనెల 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC NET పరీక్షను రద్దుచేస్తున్నట్లు బుధవారం రాత్రి ఎన్టీఏ ప్రకటించింది. NET పరీక్ష రద్దుతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News