Big Stories

Sonia Gandhi: సోనియాగాంధీకి మరోసారి కీలక బాధ్యతలు.. సీపీపీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా ఆమె పేరుతో పాటు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, కె.సుధాకరన్ పేర్లను నేతలు ప్రతిపాదించారు. ఆ తర్వాత ఆమెను పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మొదట ప్రతిపాదించగా.. ఎంపీలు సమర్థించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

- Advertisement -

హాజరైన ముఖ్యనేతలు వీళ్లే..

- Advertisement -

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీని ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శశిథరూర్, అజయ్ మాకెన్, చిదంబరంతోపాటు పలువురు మాజీ సీఎంలు హాజరై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఇటీవల వెల్లడైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ.. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో 99 స్థానాలు కైవసం చేసుకుంది. అదే విధంగా లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన సంగతి తెలిసిందే.

Also Read: ప్రధాని పదవి ఇస్తామన్నా వద్దంటున్న నితీశ్.. కారణం ఇదేనా..?

మోదీపై సోనియా విమర్శలు

2024 ఎన్నికల్లో 300 సీట్లు గెలిచి ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకొని భంగపడిన మోదీ నాయకత్వ హక్కును కోల్పోయారని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అన్నారు. వైఫల్యానికి బాధ్యత వహించకుండా..మోదీ రేపు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నాడని విమర్శలు చేశారు. మోదీ.. తన పాలన, శైలిని మార్చుకుంటాడని అనుకోవడం లేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో సీట్లు సాధించలేదో.. ఆ రాష్ట్రాల్లో సీట్లు సాధించేలా తాము దృష్టి సారిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News