Big Stories

Zika Virus in Pune : జికా వైరస్ కలవరం.. పూణెలో 6 కేసులు

Zika Virus in Pune : మనుషులకు ఒకదాని తర్వాత మరొక వైరస్ బెడద పట్టుకుంటోంది. కరోనా తగ్గిందనుకునేలోపు ఇంకో వైరస్, అదీ కాస్త తగ్గిందని ఊపిరిపీల్చుకునే లోపే వైరల్ ఫీవర్లు.. ఇప్పుడు జికా వైరస్. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 6 కేసులు నమోదవ్వగా.. వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎరంద్ వానే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గర్భిణీ స్త్రీ కి జికా వైరస్ సోకినట్లు గుర్తించామని వెల్లడించారు.

- Advertisement -

12 వారాల గర్భంతో ఉన్న మరో మహిళలకు కూడా జికా వైరస్ సోకినట్లు నిర్థారించారు. ఈ ఇద్దరు మహిళల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిజానికి ప్రెగ్నెంట్ ఉమెన్ జికా వైరస్ బారిన పడితే పిండంలో మెక్రోసెఫాలీ సంభవించి.. మెదడు అభివృద్ధి చెందకపోవచ్చు.

- Advertisement -

Also Read : కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల గుండెపోటు? మీరు భయపడాల్సిన అవసరం ఉందా.?

కాగా.. పూణెలో తొలి జికా వైరస్ కేసు ఎరంద్ వానేలోనే నమోదైంది. 46 ఏళ్ల వైద్యురాలికి, ఆ తర్వాత 15 ఏళ్ల ఆమె కుమార్తెకు కూడా పాజిటివ్ గా తేలింది. ముండ్వాలో 47 ఏళ్ల మహిళలకు, 22 ఏళ్ల మరో వ్యక్తికి వైరస్ సోకింది. 1947లో ఉగాండాలో జికా వైరస్ ను గుర్తించారు. ఇది ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఆఫ్రికా నుంచి ఆసియా వరకూ జికా వైరస్ వ్యాపించింది. 2007-2016 వరకూ అమెరికాలో వ్యాపించింది. ఆ తర్వాత 2015-16 సంవత్సరంలో జికా వైరస్ విజృంభించింది.

జికా వైరస్ సోకిన వ్యక్తులకు కణాలలో వాక్యూల్స్, మైటోకాండ్రియా ఉబ్బడం, జ్వరం లక్షణాలు ఉంటాయి. ఈ వాపు చాలా తీవ్రంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడటం, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు, కనురెప్పల కిందిభాగంలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకూ ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News