Big Stories

Shivraj singh Chouhan: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్.. త్వరలోనే ప్రకటన?

Shivraj singh Chouhan news today(Telugu flash news): పార్లమెంటు ఎన్నికల్లో తమకు సుమారుగా 400 సీట్ల వరకు వస్తాయని బీజేపీ అధిష్టానం భావించింది. కానీ, ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. అనుకున్నంతగా కాదు.. చివరకు ఎన్డీయేలోని మిత్రపక్షాల సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఇటు ఇండియా కూటమికి ఊహించినదాని కంటే అధిక సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పార్టీని పటిష్టపరిచేందుకు పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాను ఆ పదవి నుంచి తప్పించి మరో సీనియర్ నేతకు అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.

- Advertisement -

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో ఉన్న అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ కే మళ్లీ ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, బీజేపీ అధిష్టానం ఆయనను కాకుండా ఈసారి వేరొకరికి అవకాశమిచ్చింది. మోహన్ యాదవ్ ను మధ్యప్రదేశ్ సీఎంగా నియమించింది. 16 ఏళ్లకుపైగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఆ పదవి నుంచి తొలగించడంతో ఆయన కొంత అసంతృప్తిలో ఉన్నారు.

- Advertisement -

అసంతృప్తిలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ను తాజాగా అధిష్టానం ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవిని అప్పజెప్పబోతున్నట్లు భారీగా చర్చ నడుస్తోంది. అదేవిధంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

Also Read: బీజేపీ నేతల మీటింగ్, చంద్రబాబు, నితీష్‌ డిమాండ్లపై చర్చ

కాగా, లోక్ సభ ఎన్నికల్లో విదిషా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 8,21,408 మెజారిటీతో గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భాను శర్మ ఈ ఎన్నికల్లో 2,95,052 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News