Big Stories

Sam Pitroda Reappointed: శ్యాం పిట్రోడాకు అదే పదవి.. నియమించిన కాంగ్రెస్ హైకమాండ్!

Sam Pitroda Re-appointed: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా శ్యాం పిట్రోడాను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే పోస్టుకు ఆయన ఛైర్మన్‌గా ఉండేవారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో శ్యాంపిట్రోడా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయననే కాంగ్రెస్ పార్టీ నియమించింది.

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల సమయంలో వారసత్వ పన్నుపై శ్యాం పిట్రోడా ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా వివాదాస్పదమైంది. దీన్ని ఆయుధంగా మార్చుకున్న ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారని విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా అదే రేంజ్‌లో కౌంటరిచ్చింది.

- Advertisement -

భారతదేశాన్ని విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి భారతదేశం ఓ నిదర్శనమని శ్యాం పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారని గుర్తుచేశారు.

Also Read:  లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. కొత్త పదవితో పెరిగిన బాధ్యతలు

మనది వైవిధ్యమైన దేశమని, తూర్పున ఉన్న ప్రజలు చైనాయుల్లా, పశ్చిమాన ఉన్న ప్రజలు అరబ్బులుగా కనిపిస్తారని వెల్లడించారు శ్యాం పిట్రోడా. ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులు మాదిరిగా ఉంటే.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని శామ్ పిట్రోడా గుర్తుచేశారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News