Big Stories

PM Narendra Modi : ప్రధానిని టార్గెట్ చేసిన ఆర్ఎస్ఎస్ నేతలు.. ప్రమాదంలో మోదీ పదవి ?

RSS Comments on PM Narendra Modi : రాముడే మోదీకి బుద్ధి చెప్పాడనే కామెంట్స్ ఇప్పుడు జాతీయ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. అయితే.. ఈ కామెంట్స్ చేసింది కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి నేతలైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేజ్ కుమార్, అహంకారం వల్లే బీజేపీ 240 స్థానాలకు పడిపోయిందని అన్నారు. రాముడిపై భక్తిని ప్రదర్శిస్తూ అహంకార పూరితంగా ప్రవర్తించారని మోదీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఇంద్రేజ్ కుమార్ మాత్రమే కాదు. నాలుగు రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. అయితే, డైరెక్టుగా మోదీ పేరును ప్రస్తావించకుండా ఆయనకు చురకలు అంటించారు.

- Advertisement -

ప్రజాస్వామ్యంలో మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ ఎన్నికల్లో అదుపు తప్పి ప్రచారాలు చేశాయని అన్నారు. మోహన్ భగవత్ ప్రతిపక్షాలను మాత్రమే అని ఉంటే అది పెద్ద వార్త అయ్యి ఉండేది కాదు. అధికార పక్షం కూడా అని నొక్కి చెప్పారు. మోదీ ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. హిందూ మహిళల పుస్తెలను ఇండియా కూటమి తెంచేస్తుందని, హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచిపెట్టడానికే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మోదీ ఎన్నికల సమయంలో అన్నారు.

- Advertisement -

మోదీ కామెంట్స్ ను అన్ని వర్గాలు ఖండించాయి. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఇవే కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు మోదీ తీరును ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు నుంచే ఆర్ఎస్ఎస్‌కి, మోదీకి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ బలహీన పడటం, ఆర్ఎస్ఎస్ మోదీపై విమర్శలు చేయడం చూస్తుంటే.. మోదీ పదవికి గండం తప్పదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read : మన ప్రధానిలో మార్పొచ్చింది.. ఏపీకి స్వర్ణయుగం వచ్చినట్లేనా ?

ఇప్పటికిప్పుడు అయితే.. ఆయన పదవికి వచ్చిన నష్టం లేదు కానీ.. మరో రెండేళ్లలో మోదీ వయసు 75 ఏళ్లు దాటుతుంది. బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్ల తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కానీ, మోదీ మాత్రం.. దాన్ని బ్రేక్ చేసి.. ఈ ఐదేళ్లు కూడా పీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారు. అయితే.. బీజేపీ బలహీనపడటంతో పార్టీలో, ఆర్ఎస్ఎస్‌లో మోదీకి వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. అందుకే 75 ఏళ్లు తర్వాత ఆయన్ని ఇంటికి పంపిస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఈ ఏడాది చివరిలో ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ బీజేపీకి అనుకూల ఫలితాలు రాకపోతే మోదీపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరింత మంది ఆయనకు వ్యతిరేకంగా వాయిస్ పెంచుతారు.

ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాలు కూడా ఆయనకు మరీ అంత అనుకూలంగా లేవు. కేంద్రంలో టీడీపీ, జేడీయూ సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు బీజేపీకి షాక్ ఇస్తారో చెప్పలేం. రెండేళ్లలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఫలితాలు బట్టి ఆయన మరోసారి కూటమిని మార్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినా అందరికీ అనుకూలంగా ఉండే మరో నేతను పీఎంగా ఎన్నుకునే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి గత రెండు దఫాలు ఉన్నంత అనుకూలమైన పరిస్థితులు మోదీకి ఇప్పుడు లేవు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News