Big Stories

Rashid Engineer to take oath on July 5th: ఎంపీగా రషీద్‌ ప్రమాణ స్వీకారం.. అమృత్‌పాల్ మాటేంటి?

Rashid Engineer to take oath on July 5th: ఎట్టకేలకు రషీద్ ఇంజనీర్‌ ఎంపీగా ప్రమాణ స్వీకారానికి అనుమతి వచ్చేసింది. జూలై ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది. మరో ఎంపీ అమృత్‌పాల్ సింగ్ మాటేంటి? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

- Advertisement -

రషీద్ ఇంజనీర్‌‌కు పలు షరతులు విధించింది ఎన్ఐఏ. మీడియాతో ఇంటరాక్ట్ కాకూడదన్నది అందులోకి కీలకమైన పాయింట్. జూలై రెండు పాటియాలా హౌస్ కోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజనీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

జమ్మూకాశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్. అందరూ ఆయన్ని ఇంజనీర్ రషీద్ అంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై సంచలన విజయం సాధించారు. అంతకుముందు రషీద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రషీద్ తీహార్ జైలులో ఉన్నారు. టెర్రరిస్టులకు నిధులకు సంబంధించిన విషయంలో ఎన్ఏఐ అరెస్టు చేసింది. 2019 నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

మరొక ఎంపీ అమృత్‌పాల్ సింగ్. పంజాబ్‌లోని ఖదూర్ సామిడ్ సీటు నుంచి గెలిచారు ఈ ఖలిస్థానీ నేత. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్‌సింగ్ జీరాపై లక్షన్నర వేలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అమృత్‌పాల్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఖైదీగా ఉన్నారు. అమృత్‌పాల్ సింగ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

ALSO READ: కొత్త చట్టం పవర్, రాజధానిలో తొలి కేసు..

అమృత్‌పాల్ సింగ్ జూన్ 11న పంజాబ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. దీని నుంచి న్యాయస్థానం నుంచి ఆయన అనుమతి పొందాలని లాయర్లు చెబుతున్నమాట. ఈ లెక్కన అమృత్‌పాల్ న్యాయస్థానం పిటీషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News