Big Stories

Trial run on at Chenab bridge: చుక్ చుక్ రైలు.. చీనాబ్ వంతెనపై ట్రయల్ రన్ సక్సెస్

Trial run on at Chenab bridge: ఎట్టకేలకు జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ రైల్వే వంతెనపై ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది ఈ వంతెన. సంగల్దాన్ నుంచి రియాసీ వరకు ట్రయల్ రన్ చేసిన వీడియోను కేంద్ర రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

- Advertisement -

కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఉధంపూర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులోభాగంగానే 359 మీటర్లు ఎత్తున చీనాబ్ నదిపై 1315 మీటర్లు పొడవైన వంతెనను నిర్మించారు.

- Advertisement -

ఆధునిక ప్రపంచంలో ఇదొక ఇంజనీరింగ్ అద్బుతం. ఈ ట్రాక్, టన్నెళ్లు మహా అద్భుతం. ప్రపంచంలో ఎనిమిదో వింతగా దీన్ని భావిస్తున్నారు. ఈ వంతెనపై రైలు పరుగు మొదలైన రోజు రియాసీ జిల్లాకు ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుంది.

భారతీయ రైల్వే 2004లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దశలవారీగా నిర్మాణాన్ని చేపట్టింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి 1486 కోట్లు వ్యయం చేసింది. ఈ వంతెన రెండు కొండల మధ్య నిర్మించాల్సి రావడంతో అక్కడి రాళ్లను పరిశోధించి నిర్మాణం చేశారు. చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకన్ రైల్వేస్-ఆఫ్కాన్స్ సంస్థకు అప్పగించింది. ముఖ్యంగా భూకంపాల జోన్ ఒకటయితే.. రెండోది గంటలకు 266 కిలోమీటర్ల వేగంగా వీచే గాలులను తట్టుకునేలా దీన్ని నిర్మాణాన్ని చేపట్టారు.

ALSO READ: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

ఈ బ్రిడ్జి మీదుగా రాంబన్ నుంచి రియాసీకి త్వరలో రైలు సర్వీసు మొదలుకానుంది. చైనాలో బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్లు పొడవైన షుబాయ్ బ్రిడ్జి రికార్డును చీనాబ్ వంతెన అధిగమించింది. పారిస్ లోని ఐఫిల్ టవర్‌తో పోల్చితే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం విశేషం.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News