Big Stories

Rahul Gandhi : పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పట్టాభిషేకమా..? మోదీపై రాహుల్ సెటైర్లు..

Rahul Gandhi : నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తప్పుపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంట్‌ అంటే ప్రజల గళమని తెలిపారు. మోదీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే రాహుల్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.

- Advertisement -

మరోవైపు కొత్త పార్లమెంట్‌ భవనానికి పునాది రాయి వేసిన సమయంలోనూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దూరం పెట్టారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. ఇప్పుడు ప్రారంభోత్సవ వేడుకలకు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కన పెట్టారని మండిపడ్డారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. రాజ్యాంగబద్ధ పదవులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చరిత్రాత్మక కార్యక్రమాల్లో మాత్రం వారికి భాగస్వామ్యం కల్పించడం లేదన్నారు.

- Advertisement -

సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. వేడుకలను కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News