Big Stories

PM Modi Speech in Rajya Sabha: మోదీ ప్రసంగిస్తుండగా రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్..

PM Modi Speech in Rajya Sabha: దేశ ప్రజలు మూడోసారి ఎన్డీఏకు పట్టం కట్టారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.

- Advertisement -

ప్రజలు మూడోసారి పట్టం కడితే.. ఈ ప్రజాతీర్పును కొంతమంది ఇష్టపడడం లేదని ప్రధాని మోదీ చెప్పారు. 60 ఏళ్ల తర్వాత దేశంలో వరుసగా ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఎన్డఏ విజయాన్ని చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని విమర్శలు చేశారు.

- Advertisement -

రాజ్యాంగం మాకు చాలా పవిత్రమైందని ప్రధాని మోదీ వెల్లడించారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఈ అవకాశం దక్కిందని, గతంలో రిమోట్ ప్రభుత్వం నడిచిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యాంగమే దిక్సూచి అన్నారు.

ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చూపిన విశ్వాసంపై గర్వపడుతున్నానని, దేశానికి సేవ చేసే వారినే ప్రజలు ఆశీర్వదించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మూడోసారి ప్రజలు ఎన్డీఏక స్పష్టమైన మెజార్టీ ఇచ్చారన్నారు. కానీ ప్రజల నిర్ణయాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

గత 10ఏళ్లల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని, పదేళ్లుగా అఖండ సేవా భావంతో ఎన్డీఏ ముందుకు వెళ్తుందని మోదీ వెల్లడించారు. ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు. కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ దేశాన్ని ఆర్థిక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లామని గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లలో పేదరికంపై యుద్ధం చేస్తామన్నారు. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

ప్రధాని ప్రసంగానికి విపక్ష నేలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభను విపక్షాలు అవమానిస్తున్నాయని, నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించడం లేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు ఓడించినా విపక్ష నేతల్లో మార్పు రాలేదన్నారు. చర్చల్లో పాల్గొనే దమ్ము లేదని విపక్షాలు పారిపోయాయని మోదీ సెటైర్ వేశారు.

Also Read: LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. అపోలో ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు..

విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు ఇలా చేయడం సరికాదని, రాజ్యాంగాన్ని విపక్షాలు అవమానిస్తున్నాయన్నారు. విపక్ష నేతను మాట్లాడనివ్వడంలేదని రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News