Big Stories

PM Modi: రాష్ట్రపతిని కలిసిన పీఎం మోదీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి

PM Modi met President: ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా శుక్రవారం ఎంపికైన ప్రధాని మోదీ .. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కలిసారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం తనకు మద్దతునిస్తున్న ఎంపీల పేర్లతో కూడిన జాబితాను సమర్పించారు. ఈ సందర్భంగా ముర్ము ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

పీఎం మోదీకి రాష్ట్రపతి జ్ఞాపికను బహుకరించారు. అంతే కాకుండా ఎన్డీఏ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో మూడో సారి ప్రమాణ స్వీకారం చేసేందుకు మోదీ సిద్దమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ప్రధానితో పాటు మిగిలిన వారు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Also Read: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపి, జేడీయూ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి మోదీని పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకున్నాయి. అనంతరం మోదీ ఎల్కే అద్వానీ, మురళీ జోషిలను కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసారు. చివరగా రాష్ట్రపతి ముర్మును కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News