Big Stories

PM Kisan: మరో రెండు రోజుల్లో పీఎం కిసాన్ డబ్బులు..ఈ కేవైసీ చేసుకున్నారా?

PM-Kisan Samman Nidhi: కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గతంలో ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులను మరో రెండు రోజుల్లో జమ చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మొదటి సంతకం ఈ పథకం ఫైల్ మీదనే చేశారు.

- Advertisement -

ప్రతి రైతు అకౌంట్‌లో రూ.6వేలు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి రైతు ఖాతాల్లో రూ. 6వేలు అందించనుంది. ఈ నగదును ఏడాదిలో మూడు విడుతల్లో జమ చేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 18న పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇప్పటికే 16 విడతలుగా నగదు జమ చేసిన ప్రభుత్వం.. ఈసారి 17వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు వివరించారు.

- Advertisement -

రైతులకు పెద్దపీట..
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. రైతులకు పెద్దపీట వేస్తూ ఇప్పటివరకు 16 విడతలుగా నగదు జమ చేసింది.

Also Read: అమర్ నాథ్ యాత్ర, ఉగ్రదాడులు.. కాశ్మీర్ పరిస్థితిపై హోం మంత్రి అమిత్ షా సమీక్ష..

ఈ కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నగదు కోసం రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో చేసుకున్న అర్హులు కాకుండా మిగతా వారు తప్పనిసరిగా చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఈ కేవైసీ చేసుకుంటేనే నగదు జమ కానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News