Big Stories

CBI Probing UGC-NET Paper Leak Case: యూజీసీ నెట్ పేపర్ లీక్ ఎంక్వైరీ.. సీబీఐ టీమ్‌పై గ్రామస్తుల దాడి!

CBI probing UGC-NET Paper Leak Case: యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫోకస్ చేసింది సీబీఐ. ఇప్పటికే కేసు నమోదు చేసిన అధికారులు, ఎంక్వైరీ మొదలుపెట్టేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు, బీహార్‌లోని నవడా జిల్లా కాసియాదీ గ్రామానికి వెళ్లారు. వారిని స్థానికులు చుట్టిముట్టారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు.

- Advertisement -

మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు నలుగురు అధికారులు,ఓ మహిళా కానిస్టేబుల్‌ తో కూడిన సీబీఐ టీమ్ కాసియాదీ గ్రామానికి వెళ్లింది. వాళ్లు నకిలీ అధికారులంటూ గ్రామస్థులు వారిపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. దాడి చేస్తున్నట్లు సమయంలో ఆ సన్నివేశాలను రికార్డు చేశామని, వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలోపడ్డారు పోలీసులు.

- Advertisement -

చివరకు లోకల్ పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు బయటపడ్డారు. అధికారులకు చిన్నచిన్న గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని మరో 200 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: అదృష్టం ఆ రైతుదే.. 25 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది

నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. న్యాయస్థానం జోక్యంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News