Big Stories

Rahul Gandhi: వ్వవస్థలను బీజేపీ కబ్జా చేయడం వల్లే పేపర్ లీకేజీలు: రాహుల్ గాంధీ

Rahul Gandhi Over NEET UG 2024 Row: దేశంలో కొనసాగుతున్న నీట్, యూజీసీ-నెట్ వివాదంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్ని వ్వవస్థలను భారతీయ జనతా పార్టీ స్వాధీనం చేసుకున్నందున అన్ని పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

- Advertisement -

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌పై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో, పరీక్షల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందన్న నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ UGC-NETని రద్దు చేయాలని ఆదేశించిందన్నారు. ఈ విషయాన్ని సీబీఐకి అప్పగించిందన్నారు రాహుల్ గాంధీ.

- Advertisement -

బీజేపీ ప్రతి పదవికి తమ వ్యక్తులను పెడుతుందని, అందుకే ఈ లీకులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను ఒక సంస్థ కబ్జా చేసిందని ప్రతి పోస్ట్‌లో వారి వ్యక్తులను ఉంచారన్నారు ఆయన. దానిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో విద్యాసంస్థలను స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు భారతదేశంలో స్వతంత్ర విద్యా వ్వవస్థ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్థం చేశారు.

వైస్ ఛాన్స్‌లర్లను మెరిట్ ఆధారంగా నియమించాలని కానీ ప్రభుత్వం తమ వారని ఆ పదవుల్లో కూర్చోబెడుతోందని అన్నారు. బీజేపీ విద్యావ్వవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. బీజేపీ విద్యావ్వస్థలోకి చొచ్చుకుపోయిందని అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ ఆర్థిక వ్వవస్థను ఎలా కుప్పకూల్చారో ఇప్పుడు విద్యావ్వవస్థను అలానే చేస్తున్నారని ఆవేదన వ్వక్తం చేశారు.

Also Read: అవును.. NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు

ప్రశ్న పత్రలా లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన పెడుతున్నారని.. ఇది ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. లీకేజీపై విద్యార్థులు రోడ్లెక్కారని.. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలన్నారు రాహుల్ గాంధీ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News