Big Stories

Pani Puri Ban: పానీ పూరీ.. బ్యాన్ విధించేందుకు కర్ణాటక, తమిళనాడు రెడీ..!

Pani Puri Bann Update: దేశవ్యాప్తంగా ఇప్పుడు పానీ పూరీ గురించి ఒకటే చర్చ. ఇందులో క్యాన్సర్‌‌కి సంబంధించిన పదార్ధాలు ఉండటమే అసలు కారణం. ఈ నేపథ్యంలో పానీ పూరీపై నిషేధం విధిస్తారా? ఇందులో ఏఏ రాష్ట్రాలున్నాయి? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

- Advertisement -

సాయంత్రం అయితే చాలు చాలామంది దృష్టి పానీ పూరీ మీదకు మళ్లుతుంది. సిటీ అయినా పట్టణమైనా .. చిన్న పల్లెటూరైనా చిన్నారులు, యువతీ యువకులు ఆయా బండ్లు వద్ద కనిపిస్తారు. దీనికి సంబంధించిన కొత్త వార్త వీళ్లని కలవరపెడుతోంది. అలాంటి పానీ పూరీలో కేన్సర్ కారకాలున్న విషయం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

- Advertisement -

కర్ణాటకలో ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూనీ పూరీలో వినియోగించే నీళ్లకు గ్రీన్ రంగు వచ్చేందుకు కొన్ని కెమికల్స్ వాడుతున్నట్లు తేలింది. అందులో అందులో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. కేవలం రంగు కోసమే దీన్ని వాడుతున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 270కి పైగానే శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్‌లకు తీసుకెళ్లి పరీక్షించారు.

వాటిలో 41 శాంపిల్స్‌లో కేన్సర్‌కు సంబందించిన రసాయనాలు ఉన్నట్లు తేలింది. దీంతో పానీపూరీ విషయంలో ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తోందట అక్కడి ప్రభుత్వం. నిషేధం విధిస్తే బాగుంటుందని చాలామంది అధికారులు అభిప్రాయపడ్డారట. కర్ణాటకలో పానీ పూరి గురించి కొత్త విషయాలు వెలుగులోకి రాగానే పొరుగునున్న తమిళనాడు అలర్ట్ అయ్యింది.

Also Read: మోదీ ప్రసంగిస్తుండగా..ఆందోళన నడుమ రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్

తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు పలు షాపుల్లో తనిఖీలు చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించ లేదని, చాట్ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పనిలోపనిగా పానీ పూరీ శాంపిల్స్‌ను తీసుకుని ల్యాబ్‌కు దాదాపు కర్ణాటక మాదిరిగానే ఫలితాలు వచ్చినట్టు సమాచారం. దీంతో తమిళనాడు కూడా కర్ణాటక బాటలోనే నడవాలని ఆలోచన చేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News