Big Stories

Nitin Gadkari: 132 సీట్ల బస్సు.. విమానం తరహా సౌకర్యాలు: నితిన్ గడ్కరీ

Nitin Gadkari: దేశ వ్యాప్తంగా కాలుష్యం ప్రధాన సమస్యగా మారిందని ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు నూతన మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకోసం నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతుందని తెలిపారు. కాలుష్యం ముప్పును ఎదుర్కునేందుకు దిగుమతి ప్రత్యామ్నాయం, కాలుష్య  రహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఖానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరం అని అన్నారు.

- Advertisement -

ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వందల సంఖ్యలో ఇథనాల్ పంప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా రూ. 120 లీటర్ పెట్రోల్‌కు ఖర్చు పెట్టే బదులు రూ. 60తో ఇథనాల్ వాడవచ్చన్నారు. డీజిల్ బస్సు కిలోమీటర్ ప్రయాణానికి రూ. 115 ఖర్చు అవుతందని తెలిపారు. అదే ఎలక్ట్రిక్ బస్సు అయితే రూ. 50 నుంచి 60 ఖర్చు అవుతుందన్నారు. దీంతో టికెట్ ధర 15 నుంచి 20 శాతం తగ్గుతుందని తెలిపారు.

- Advertisement -

పైలట్ ప్రాజెక్ట్ :

చెక్ రిపబ్లిక్ వెళ్లినప్పుడు అక్కడ 3 బస్సులను కలిపి ఒకే ట్రాలీ బస్సు లాగా తయారు చేయడం చూశానని తెలిపారు. తర్వాత టాటా సహకారంతో నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినట్లు చెప్పారు. 132 మంది కూర్చునేలా బస్సును రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 40 కిలో మీటర్ల దూరం వెళ్లాక బస్సుకు ఛార్జింగ్ చేసుకోవాలని అన్నారు. 40 సెకన్ల పాటు చార్జింగ్ పెడితే మరో 40 కిలో మీటర్లు వెళ్లవచ్చన్నారు. దీంతో కిలో మీటర్‌కు రూ. 35 నుంచి రూ. 40 మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు.

సౌకర్యాలు :

ఈ బస్సులో విమానంలో లాగానే సీటింగ్, ఏసీ, సీటు ముందు ల్యాప్ టాప్ పెట్టుకునే సదుపాయం ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. అంతే కాకుండా ఎయిర్ హోస్టెస్ లాగా పండ్లు, ప్యాక్ చేసిన ఆహారం, శీతల పానీయాలు అందించేందుకు బస్ హోస్టెస్ ఉంటారని తెలిపారు. డీజిల్ బస్సుతో పోలిస్తే ఈ బస్సు నిర్వహణకు ఖర్చు 30 శాతం తగ్గుతుందన్నారు. ఒక వేళ సోలార్ పవర్ వినియోగిస్తే ఈ ఖర్చు మరింత తగ్గుతుందని తెలిపారు. దేశంలో కాలుష్య రహిత రవాణా మెరుగు పరిచేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News