Big Stories

Nitin Gadkari pilot project: గడ్కరీ వెల్లడి.. విమానం తరహాలో బస్సు, పైలట్ ప్రాజెక్టు నాగ్‌పూర్‌లో

Nitin Gadkari pilot project updates(Today latest news telugu): విమానంలో మినిమం 100 మందికి పైగానే ప్రయాణికులు ఉంటారు. అదే తరహాలో బస్సును తీసుకొస్తే ఎలా ఉంటుంది? దీనిపై ఆలోచన చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్.
ఇప్పటికి ఆ ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

- Advertisement -

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెక్ రిపబ్లిక్‌కు వెళ్లారు. ఆ దేశ రాజధాని పరాగ్వేలో మూడు బస్సులు కలిపి ఒకటిగా ఉండడం గమనించారు. ఆ తరహా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఇండియాలో అయితే బాగుంటుంద ని అనుకున్నారు. టాటా సహకారంతో దాన్ని నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారాయన.

- Advertisement -

పరాగ్వే ట్రాన్స్‌పోర్టు బస్సులో ఎంతమంది కూర్చున్నారనేది పక్కనబెడితే.. నాగ్‌పూర్ ప్రాజెక్టులో మాత్రం 132 మంది కూర్చునేలా రూపొందిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఆ తరహా బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 40 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ఛార్జింగ్‌కు కేవలం 40 సెకన్లు మాత్రమే. దీంతో కిలోమీటరుకు ఖర్చు 35 నుంచి 40 రూపాయలు మాత్రమే అవుతుందన్నారు.

దీనివల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతం గా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనివల్ల స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరమన్నారు. దేశంలో ఇప్పటికే విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

వందల సంఖ్యలో ఛార్జి స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. లీటర్ పెట్రోల్‌కు 120 రూపాయలు పెట్టేబదులు, కేవలం 60 రూపాయలతో ఇథనాల్ వాడవచ్చని అన్నారు. డీజిల్ బస్సుకు లీటరుకు 115 రూపాయలు ఖర్చు కాగా, విద్యుత్ ఏసీ బస్సు అయితే 60- 50 రూపాయలు అవుతుందన్నారు. ఆ తరహా పద్దతి వల్ల టికెట్ ధర 10 నుంచి 20 శాతం తగ్గవచ్చన్నారు.

ALSO READ: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. అపోలో ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు..

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. రెండు బస్సులను కలిపి ఒకటిగా తీసుకొచ్చారు. ఇండియాలోని మేజర్ సిటీల్లో ఆయా బస్సులను వినియోగించారు. దాదాపు 60 మంది ప్రయాణికులు ఎక్కేవారు. కాకపోతే మన రహదారులకు అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి. దీంతో వాటిని మరోలా వినియోగించుకున్నాయి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు. మరి కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు పరాగ్వే తరహా బస్సులకు మన రహదారులు ఏ విధంగా కనెక్టు అవుతాయనేది అసలు ప్రశ్న.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News