Big Stories

New Criminal Laws : అబ్బాయిలూ జాగ్రత్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. అలా చేస్తే ఉరిశిక్షే

New Criminal Laws : నేటి నుంచి కొత్తచట్టాలు అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ పాలన నాటి నుంచి కొనసాగుతున్న ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలు ఇక కనిపించవు. వీటి స్థానంలో బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత), బీఎన్ఎస్ఎస్ (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత), బీఎస్ఏ (భారతీయ సాక్ష్య అధినియమ్) చట్టాలు అమలు అయ్యాయి. అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్ఐఆర్, ఎస్ఎంఎస్ వంటి కొత్తచట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయుల కోసం భారతీయ చట్టాలను రూపొందించినట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు.

- Advertisement -

కొత్తచట్టాల అమలుతో.. అబ్బాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే ఇకపై కేసులతో కోర్టుల చుట్టూ తిరగడం కాదు. డైరెక్ట్ గా జైలుకే వెళ్తారు. అలాగే క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తైన 45 రోజుల్లోగా తీర్పు రావాలి. మహిళలు, చిన్నారులపై నేరాలు, సామూహిక అత్యాచారానికి పాల్పడితే.. మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.

- Advertisement -

ఐపీసీ లో గందరగోళంగా ఉన్న సెక్షన్లను.. భారతీయ న్యాయ సంహితలో మరింత సులభం చేశారు. 511 సెక్షన్లను 358కి కుదించారు. క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని సందర్శించడం తప్పనిసరి చేశారు. ఐపీసీ సెక్షన్లలో చిన్నారులపై నేరాలు, సామూహిక అత్యాచారాలకు ప్రత్యేక సెక్షన్లు లేవు. బీఎన్ఎస్ లో వాటికోసం ప్రత్యేక సెక్షన్లను తీసుకొచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News