Big Stories

New criminal laws First case registered: కొత్త చట్టం పవర్, రాజధానిలో తొలి కేసు కాదు, గ్వాలియర్‌లో..

New criminal laws First case registered: మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను  వెంటనే వెనక్కి తీసుకోవాలన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట. ఈ చట్టం సామాన్యులకు గుదిబండగా మారుతుందని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు గొంతెత్తారు. అయినా మోదీ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మరీ ఈ చట్టాలను పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదించుకుంది.

- Advertisement -

జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఈ చట్టం పవరేంటో గానీ, అమల్లోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. అదీ కూడా వీధి వ్యాపారిపై ఈ కేసు రిజిస్టర్ అయ్యింది. కొత్త క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -

ఢిల్లీలోని కమల మార్కెట్ ఏరియాలో వీధి వ్యాపారి వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్ముతాడు. వెండర్ తాత్కాలిక దుకాణం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది. దానివల్ల రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ దుకాణాన్ని వేరే చోటకు తరలించాలని పోలీసులు పలుమార్లు చెప్పారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన పోలీసులు అందుకు సంబంధించి వీడియోను తీసి కేసు నమోదు చేశారు.

ALSO READ: మహారాష్ట్రలో భారీ వర్షాలు, రోడ్డుపైకి మొసలి, కొట్టుకుపోయిన ఫ్యామిలీ

కొత్త క్రిమినల్ చట్టాల కింద తొలి కేసు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నమోదైందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇది దొంగతనం కేసు అని, మోటార్ సైకిల్ దొంగతనం చేశారన్నారు. అర్ధరాత్రి 12.10 గంటలకు ఈ కేసు నమోదైంది. ఢిల్లీలో నమోదైన కేసు గురించి మాట్లాడిన ఆయన, ఇంతకుముందు అదే నిబంధనలు ఉన్నాయని, ఇది కొత్త నిబంధన కాదన్నారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News