Big Stories

NEET Dispute : వాడివేడిగా పార్లమెంట్.. తొలి సమావేశంలోనే అట్టుడికిన ఉభయ సభలు

NEET Dispute in Parliament(Telugu breaking news today): ఎన్డీఏ సర్కార్‌ మూడోసారి కొలువుదీరాక తొలిసారిగా ప్రారంభమ్యాయి పార్లమెంట్ సమావేశాలు. అలా ప్రారంభమయ్యాయో.. అప్పుడు అధికార, విపక్షాల మధ్య ఫైట్ మొదలైంది. అయితే ఈసారి వివాదం నీట్‌ ఎగ్జామ్‌పైన జరిగింది. అవును.. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అంశం ఉభయసభలను అట్టుడికించింది. వాయిదాల పర్వం కూడా మొదలైపోయింది. ఇంతకీ ఉభయసభల్లో ఏం జరిగింది? దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది?

- Advertisement -

నీట్ ఎగ్జామ్.. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తుంది. పేపర్ లీక్ అయ్యిందని.. పరీక్ష నిర్వహణలో, రిజల్ట్స్‌ రిలీజ్ చేయడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు ఇదే అంశంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పంచాయితీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఇప్పుడీ అంశం పార్లమెంట్‌లో కూడా లెవనెత్తింది ఇండియా కూటమి. నీట్‌పై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఈ చర్చలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనాలని డిమాండ్ చేశారు విపక్ష ఎంపీలు.

- Advertisement -

అటు లోక్‌సభతో పాటు.. రాజ్యసభలోనూ ఇదే అంశంపై హాట్ డిబెట్ జరిగింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో ఉభయ సభలను వాయిదా వేశారు. అంతకుముందు లీకేజీలపై చర్చించాలని విపక్షాలు ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే కేంద్రం వీటిని తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీట్‌ ఒక్కటే కాదు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే డజనుకుపై ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ను కూడా పర్యవేక్షించాలని డిమాండ్ చేశాయి.

Also Read : నీట్ పేపర్ లీక్.. ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీబీఐ..

అయితే కేంద్రం ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తనకు నీట్ పేపర్ లీక్‌కు సంబంధించి 22 నోటీసులు అందాయని స్పీకర్‌ ఓంబ్లిర్లా కూడా అనౌన్స్ చేశారు. నీట్‌ అవకతవకలపై న్యాయ విచారణ జరుగుతుందని రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చెప్పారని గుర్తు చేశారు. తాము నీట్‌పై న్యాయ విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు బీజేపీ నేతలు.

అయితే ఉభయసభల్లో అన్ని కార్యకలాపాలను సస్పెండ్ చేసి నీట్‌పై చర్చించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాదు ఇప్పటి వరకు ఏ ఒక్క ఎగ్జామ్‌ను కూడా రద్దు చేయలేదంటూ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ ఎంపీలు. కేంద్రం పేపర్ లీక్‌ సర్కార్‌గా మారిందని.. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతు ఎత్తుతున్న రాహుల్ గాంధీ మైక్‌ను కూడా కట్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

ఇండియా కూటమి నీట్‌ ఎగ్జామ్స్‌ అవకతవకలపై పోరు విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. నీట్ పరిక్షపై చర్చ జరిపితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్‌లో మాట్లాడనివ్వడం లేదు.. మైక్‌లు కట్ చేస్తున్నారు. అయినా కానీ తమ పోరాటం ఆగదని క్లియర్‌ కట్‌గా చెబుతున్నారు ఆయన.

తాము ఒకరోజు పూర్తిగా ఈ అంశంపై చర్చ జరపాలనుకున్నాం. కానీ ప్రధాని మోడీ దీనికి సిద్ధంగా లేరు. దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన వ్యక్తి ఇలా మొఖం చాటేస్తే ఎలా? ఆయన ఓపినియన్ ఏంటో ప్రజలకు చెప్పకపోతే ఎలా? కోట్లాది మంది ప్రజలతో ఈ అంశం ముడిపడి ఉందన్న విషయం మరిచారా ?అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు రాహుల్. ఇది లక్షలాది మంది విద్యార్థులకు.. కోట్లాది మంది కుటుంబాలకు ముడిపడిన అంశమంటున్నారు. మరి ఇప్పటికైనా కేంద్రం దిగి వచ్చి నీట్‌పై చర్చిస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News