Big Stories

Anti paper leak law: కేంద్రం కొత్త చట్టం, పేపర్ లీక్ చేస్తే.. ఐదేళ్లు జైలు, కోటి జరిమానా..

Anti paper leak law: పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం మోదీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఓ వైపు విద్యార్థులు .. మరోవైపు రాజకీయ నేతలు మోదీ సర్కార్ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కొత్త యాక్ట్‌ని తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం.

- Advertisement -

ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. జూన్ 21 అంటే (శుక్రవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు చెబుతూ నోటిఫికేషన్ వెలువడింది. ఇక నుంచి పరీక్ష పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద కేసు నమోదు చేయనున్నారు. దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్దంగా పరీక్ష పేపర్లను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి సాయం చేసినా, టెక్నాలజీ వినియోగించి ట్యాంపరింగ్ చేయడం, నకిలీ పరీక్షలు నిర్వహించినా కఠిన శిక్ష తప్పదన్నమాట.

- Advertisement -

దీనికి బాధ్యులైన వారికి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుతోపాటు కోటి వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. ఇందులో భాగస్వాములైనవారు నేరం రుజువైతే వారి ఆస్తులను జప్తు చేయనున్నారు. అంతేకాదు పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేయనున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నోరువిప్పారు.

ALSO READ:  నీట్ వివాదంపై స్పందించిన జైరాం రమేష్.. మోదీ సర్కార్‌పై ఫైర్

ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల నేపథ్యంలో తేదీని ప్రకటించలేదన్నారు. దీనికి సంబంధించి నిబంధనలను న్యాయశాఖ రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. మంత్రి వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రప్రభుత్వం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News