Big Stories

NDA Meeting: ఓం బిర్లానే మళ్లీ లోక్‌సభ స్పీకర్..?

NDA Meeting at Rajnath Singh Residence: లోక్‌సభ స్పీకర్ పదవిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పదవిపై ఏకాభిప్రాయం కుదిర్చే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అప్పగించారు. మంగళవారం లోక్ సభ స్పీకర్ పదవి అభ్యర్థికి సంబంధించి రక్షణ మంత్రి ఇంట్లో బీజేపీ, మిత్రపక్షాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పీకర్ పదవిపై చర్చించారు. మిత్రపక్షాల నుంచి బీజేపీ పలు సూచనలు కోరినట్లు తెలుస్తోంది. ఇటు మిత్రపక్షాలు కూడా నిర్ణయాన్ని బీజేపీకే వదిలేశాయని చెబుతున్నారు. దీనిపై బీజేపీ తుది నిర్ణయం తీసుకోనున్నది. అయితే, 18వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనున్నది.

- Advertisement -

కాగా, స్పీకర్ పదవి కోసం చాలామంది పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఓం బిర్లానే మళ్లీ లోక్ సభ స్పీకర్ అవుతారనే చర్చ కూడా భారీగానే కొనసాగుతున్నది. రాజస్థాన్ లోని కోట లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా గెలుపొందారు. అదేవిధంగా పురందేశ్వరి, రాధామోహన్ సింగ్, భర్తిహరి మహతాబ్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. రాధామోహన్ సింగ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేంద్రమంత్రిగా పని చేసిన ఈయన ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏపీకి చెందిన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఎన్డీయేలో భాగమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈమె బంధువు అవుతారు. ఈ పరిస్థితుల్లో ఈమె పేరును ఎంపిక చేస్తే టీడీపీకి కూడా అభ్యంతరం ఉండకపోదనే చర్చ కొనసాగుతున్నది. రాజమండ్రి నుంచి ఈమె ఎంపీగా ఎన్నికయ్యారు. భర్తిహరి ఒడిశాకు చెందిన బీజేపీ నేత. అయితే, ఒడిశాలో ఈసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో అక్కడి నేతకు ప్రాధాన్యమిచ్చే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -

Also Read:నలందా యూనివర్సిటీలో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ.. నలందకు ఘనమైన చరిత్ర!

2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఇతర పార్టీల కంటే బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి బీజేపీ సొంతంగా 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది. దీంతో ఇతర పార్టీల మద్దతు కోరాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయం తీసుకునేముందు బీజేపీ తన మిత్రపక్షాలతో చర్చించాల్సి వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News