Big Stories

Medha Patkar Sentenced In Defamation Case: పరువు నష్టం కేసు.. మేధా పాట్కర్‌కు ఐదు నెలల జైలు శిక్ష..

Narmada Bachao Andolan activist Medha Patkar Sentenced in Defamation Case: పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేధా పాట్కర్‌కు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ సాకేత్ కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి కేవీఐసీ ఛైర్మన్, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేసిన పరువు నష్టం దావాలో సాకేత్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. అలాగే సక్సేనాకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని పాట్కర్‌ను కోర్టు ఆదేశించింది.

- Advertisement -

- Advertisement -

కాగా ఢిల్లీ సాకేత్ కోర్టు తీర్పుపై మేధా పాట్కర్ స్పందించారు. తాను ఎవరినీ కించపరిచే ప్రయత్నం చేయలేదని అన్నారు. తాను ఈ తీర్పును సవాల్ చేస్తానని తెలిపారు. సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేరు అని పేర్కొన్నారు.

అటు సాకేత్ కోర్టు ఈ తీర్పును సవాల్ చేసేందుకు 30 రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది. అయితే మేధా పాట్కర్ చెల్లించే పరిహారం తమకు అవసరం లేదని ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి అందజేస్తామని వీకే సక్సేనా తరఫు న్యాయవాది వాదించారు. అయితే దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఫిర్యాదుదారుకు నష్టపరిహారం ఇస్తామని ఆపై మీ ఇష్టానుసారం దాన్ని పరిష్కరించుకోవచ్చని తెలిపింది.

దాదాపు రెండేళ్ల క్రితం ఓ టీవీ ఛానెల్‌లో తనపై కించపరిచే వ్యాఖ్యలు చేసి.. తన పరువుకు భంగం కలిగించే ప్రకటన చేసినట్లు సక్సేనా మేధా పాట్కర్‌పై రెండు పరువు నష్టం దావాలు వేశారు.

అయితే ఈ కేసులో పాట్కర్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. సక్సేనాకు వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రకటనలు పరువు నష్టం కలిగించడమే కాకుండా ప్రతికూల భావాలను ప్రేరేపించాయని అని మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News