Big Stories

Modi 3.0 Swearing In: ముచ్చటగా మూడోసారి.. మోదీ 3.0 ఎలా ఉండబోతోంది..?

- Advertisement -

దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. మొత్తం 16 సంవత్సరాల 282 రోజుల పాటు ప్రధాని పదవిలో ఉన్నారు. ఆయన ప్రధాని పదవిలో ఉండగానే మరణించారు. ఆ తర్వాత ఎవరు వరుసగా మూడుసార్లు ప్రధాని అయినవారు లేరు. ఆ ఘనత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతోంది. మామూలుగా అయితే బీజేపీ 75 ఏళ్లు నిండిన నేతలను పక్కన పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. మోదీకి 2025 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. సో ఆయనను కూడా పక్కన పెడతారా అనే క్వశ్చన్‌ ఇప్పుడు కాదు.. ఎన్నికలకు ముందే వచ్చింది. బట్ అలాంటి రూల్‌ తమ పార్టీలో ఏం లేదని క్లియర్‌ కట్‌గా చెప్పింది బీజేపీ.. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్ గడ్కరి లాంటి లీడర్స్‌ కూడా ఇదే టైప్‌లో అనౌన్స్‌ చేశారు.

- Advertisement -

బట్ ఇప్పటి వరకు జరిగినట్టుగా మోదీ పాలన దూకుడుగా ఉండే చాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మిత్రపక్షాల అవసరం ఎక్కువగా ఉంది మోదీకి.. అందుకే ప్రతి విషయాన్ని ఏకపక్షంగా కాకుండా.. మిత్రపక్ష పార్టీల నేతలతో చర్చించాల్సి ఉంటుంది. అందుకే చాలా వరకు బీజేపీ ఆశలు, ఆశయాలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. అయితే అత్యంత కీలకమైన శాఖలు.. లైక్ ఫైనాన్స్, డిఫెన్స్, ఫారిన్ ఎఫైర్స్, హోమ్‌ శాఖలు మాత్రం తమ చేతుల్లోనే ఉంటాయని ఇప్పటికే మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది బీజేపీ. దీనికి ఆ పార్టీలు కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది. బీజేపీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలంటే ఈ శాఖలు చాలా కీలకం. అంటే అత్యంత ముఖ్యమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మిత్రపక్షాలకు చెప్పకనే చెబుతోంది బీజేపీ.

Also Read: సోనియాగాంధీకి మరోసారి కీలక బాధ్యతలు.. సీపీపీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం

ఇటు మిత్రపక్షాలకు కూడా భారీ సంఖ్యలో సీట్లు ఏం రాలేదు. అండ్.. వీరికి నచ్చే కూటమిలో చేరారు కాబట్టి ఎక్కువగా ఇంటర్‌వీన్ అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ ఇప్పటికే బీహార్‌కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కనుక తలొగ్గితే.. వెంటనే ఏపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది.. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి దీనిని బీజేపీ పెద్దలు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. నిజానికి ఇలాంటి విషయాలను డీల్ చేయడంలో మోదీ చాణక్యుడనే చెప్పాలి. సో మరో ఐదేళ్ల పాటు బండిని సాఫీగా లాగించేలా ప్లాన్‌ చేసుకోగలరు.

అయితే బీజేపీ మిత్ర పక్షాలకు ఎంత అవసరమో.. మిత్రపక్షాలకు బీజేపీ కూడా అంతే అవసరం.. సో వారు గెలిచిన ఎంపీ సీట్లకు తగ్గట్టుగా కేబినెట్‌లో చోటు కల్పించాల్సి ఉంటుంది. సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి Misunderstandings కి చాన్స్ ఉండదు. అలా జరగకపోతే కలహాల కాపురం కాక తప్పదు మోదీ3.0 పాలన.. అందుకే మేమింతే.. మేము ఇలానే ఉంటాం.. మా పాలసీ ఇంతే.. అనే థాట్‌ను మోదీ అండ్ బీజేపీ వీడాల్సి ఉంటుంది. దీంతో పాటు.. మరికొన్ని విషయాలపై మోదీ దృష్టి సారించే అవకాశం ఉంది. 2019 మ్యాజిక్‌ను 2024లో ఎందుకు రీపిట్ అవ్వలేదు.. ? సీట్ల సంఖ్య ఎక్కడ తగ్గింది? ఎందుకు తగ్గింది? ఈ విషయాలపై కూడా రివ్యూ చేసుకొని.. మళ్లీ సొంతంగా పుంజుకునేందుకు ప్రయత్నించక తప్పదు. సో.. ఓవరాల్‌గా చూస్తే మోదీ 3.0 కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా సాగనుందని తెలుస్తుంది.

Also Read: Modi first cabinet meeting: మోదీ కేబినెట్ భేటీ, శాఖల కేటాయింపు.. కీలక సూచనలు

మొత్తానికి హస్తిన ఇప్పుడు మరోసారి మోదీ పట్టాభిషేకానికి ముస్తాభవుతోంది. ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలి రానుండటంతో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయిదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, NSG కమాండోలు, డ్రోన్‌లు, స్నైపర్‌లతో కట్టుదిట్టమైన భద్రత సిబ్బందిని మోహరించారు. మొత్తం మూడంచెల భద్రతలో భాగంగా మొత్తం 2 వేల 500 మంది సిబ్బంది సెక్యూరిటీలో ఉన్నారు.. ఢిల్లీ ఫ్లైజోన్‌గా మారిపోయింది. మరికొన్ని గంటల్లో మూడోసారి ప్రమాణస్వీకారం చేసి సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News