Big Stories

Nalanda University Inaugurates: నలందా యూనివర్సిటీలో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ.. నలందకు ఘనమైన చరిత్ర!

PM Modi new campus of Nalanda University: బీహార్‌లోని చారిత్రక నలందా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన కొత్త క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. రాజ్‌గిరిలో శిథిలమైన పురాతన నలందా యునివర్సిటీ సమీపంలోనే ఈ క్యాంపస్ నిర్మించారు. కొత్తగా నిర్మించిన క్యాంపస్‌లో రెండు అకాడమిక్ బ్లాక్స్ ఉన్నాయి. 2014లో 14 మంది విద్యార్థులతో కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది.

- Advertisement -

నలందా యూనివర్సిటీని చేరుకున్న మోదీ.. ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాని నిశితంగా పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి కొత్త క్యాంపస్ వద్దకు చేరుకున్నారు. ఈ మేరకు అక్కడ బోధి వృక్షాన్ని నాటారు.

- Advertisement -

హాజరైన ప్రముఖులు
నలందా యూనివర్సిటీలోని కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి విదేశాల రాయబారులు, దేశంలోని మంత్రులు, గవర్నర్, ముఖ్యమంత్రులతోపాటు ప్రముఖులు హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ సీఎం నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్స్‌లర్ అరవింద్ పనగారియా హాజరయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా. చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుంచి విదేశీ రాయబారులు పాల్గొన్నారు.

కెపాసిటీ @ 1900
నలందా యూనివర్సిటీలో 40 తరగతులతో ఉన్న రెండు అకాడమిక్ బ్లాక్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 1900 మంది విద్యార్థులు కూర్చునేందుకు సిట్టింగ్ కెపాసిటీ ఉంది. 300 సీట్ల సామర్థ్యంతో రెండు ఆడిటోరియంలు ఏర్పాటు చేయగా.. సుమారు 550 మంది విద్యార్థులతో హాస్టల్ వసతి కల్పించారు. దీంతో పాటు అంతర్జాతీయ కేంద్రం, యాంఫీథియేటర్ కూడా నిర్మించారు. ఇందులో 2వేల మంది కూర్చునే వీలు ఉంది. అలాగే విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో పాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. దీనిని ఈస్ట్ ఆసియా సమ్మిట్ దేశాల సహకారంతో నెట్ జీరో గ్రీన్ క్యాంపస్‌గా నిర్మించారు.

ఘనమైన చరిత్ర..
నలందా విశ్వవిద్యాలయం చాలా పురాతనమైంది. క్రీస్తుశకం 427లో స్థాపించిన ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి 10వేల మందికిపైగా విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగించగా.. 1500 మంది ఉపాధ్ాయులు ఉండేవారని సమాచారం. దాదాపు 800 సంవత్సరాల పాటు చాలామంద విద్యార్థులకు విద్యను అందించింది. తర్వాత 12వ శతాబ్ధంలో ఆక్రమణ దారులు నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News