Big Stories

Rahul Gandhi: భారత్‌లోని పేదలు, వయనాడ్ ప్రజలు.. వీరే నా దేవుళ్లు: రాహుల్ గాంధీ!

Rahul Gandhi Comments in Wayanad People: 2024 లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి గెలిపించినందుకు కేరళ ఓటర్లకు ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. కేరళలోని మలప్పురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.

- Advertisement -

రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో అతను వయనాడ్ లేదా రాయ్‌బరేలిలో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ విషయంపై రాహుల్ గాంధీ స్పందించారు. తన డైలమాలో ఉన్నానని.. వయనాడ్, రాయ్ బరేలిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తనకు తప్ప అందరికీ తెలుసని అన్నారు. తను తీసుకునే నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండటమే తనకు కావాలని తెలిపారు.

- Advertisement -

ఇక ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత. తాను దురదృష్టవశాత్తు మోదీలా కాకుండా మనిషిని అని.. ప్రధానిలా తనని ఏ దేవుడు గైడ్ చెయ్యడం లేదని అన్నారు. తనకు దేశంలోని పేదలు, వయనాడ్ ప్రజలు దేవుళ్లని తెలిపారు. అందుకే తాను వయనాడ్ ప్రజలకు కట్టుబడి ఉంటానన్నారు.

Also Read: G7 summit: జీ7 సదస్సుకు ఇటలీ వెళ్లనున్న ప్రధాని.. మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన

ఇక అయోధ్య, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి గురించి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఆత్మను, ప్రజల ఆలోచనలపై దాడి చేయడం వల్లే బీజేపీ ఓటమి పాలయ్యిందని అన్నారు. మన రాజ్యాంగంలో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌ అంటారన్నారు రాహుల్. రాష్ట్రాలు, భాషలు, చరిత్ర, సంస్కృతి, మతం, సంప్రదాయాల కలయిక భారతదేశం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

కాగా ఇటీవలి ముగిసిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి తన సమీప సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాపై 3 లక్షల 64 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధా వయనాడ్ నుంచి పోటీ చేసి 4.3 లక్షల రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించారు.

Also Read: జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు: కిరణ్ రిజిజు

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మెజారిటీపై గాంధీ మాట్లాడారు. కేంద్రంలో ఏర్పడుతున్న ప్రభుత్వం వికలాంగ ప్రభుత్వం అని, ప్రతిపక్షాలు బీజేపీని చావుదెబ్బ కొట్టాయని అన్నారు. ప్రధాని మోదీ తన వైఖరి మార్చుకోవాల్సి ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ప్రతిపక్షాలుగా తాము ప్రజల బాగు కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News