Big Stories

Priyanka Chaturvedi: ఈవీఎంలపై ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు !

Priyanka Chaturvedi: దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై పుస్తకాన్ని ప్రచురించారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. ముంబాయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈవీఎంపై ప్రచురించిన పుస్తకాన్ని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వాని కూడా సమర్థించారని పేర్కొన్నారు. ఈవీఎంలపై ఎలాంటి సందేహాలున్నా వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.

- Advertisement -

దేశంలో ఒక్క ఓటరుకు ఎన్నికల ప్రక్రియపై అనుమానం వచ్చినా దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్చగా, సజావుగా జరగాలని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలకు విఘూతం కలగకుండా తామ గొంతుకను వినిపిస్తామని చెప్పారు.

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లపై శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ఈసీ అంటే ఎన్నికల కమీషన్ కాదని.. ఈజీలీ కాంప్రమైజ్డ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఈవీఎంలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News