Big Stories

MP Mahua Moitra criticised to BJP: బీజేపీపై ఎంపీ మహువా ఫైర్, తగిన మూల్యం చెల్లించుకుందంటూ

MP Mahua Moitra criticizes BJP(Latest political news in India): తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అంటే సీఎం మమత తర్వాత ఎంపీ మహువా మొయిత్రా పేరు బలంగా వినిపిస్తుంది. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడంలో ఈమెకు తిరుగులేదు. గతంలోనేకాదు ఈసారీ ఆమెది అదే దూకుడు. తాజాగా సోమవారం లోక్‌సభ సమావేశాల్లో తన వాయిస్‌ను రైజ్ చేశారామె. మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారామె.

- Advertisement -

నిండు సభలో తన నోరు నొక్కినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆరోపించారు ఎంపీ మహువా మొయిత్రా. దాని ఫలితంగా ఈసారి ఎన్నికల్లో 63 సీట్లు కోల్పోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి మద్దతు తెలిపే క్రమంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత సభలో తనను మాట్లాడ నీయకుండా చేశారని, ఈసారి ప్రజలు మీ నోళ్లను కట్టేశారని మండిపడ్డారు.

- Advertisement -

గతంలో మాదిరిగానే ఇప్పుడు ప్రతిపక్షాలపై ప్రవర్తించే పరిస్థితి లేదన్నారు. సెంగోల్ అనేది రాచరికానికి గుర్తని, ప్రజాస్వామ్యంలో దాని అవసరం లేదన్నారామె. సభ నుంచి సెంగోల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు ఎంపీ మహువా. గతంలో తనను సభ నుంచి బహిష్కరించడంపై ఎంపీ మహువా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నా సభ్యత్వం, ఇల్లు కోల్పోయానని.. ఇప్పుడు ఆ భయం నుంచి విముక్తి పొందానని గుర్తు చేశారు. ఇది స్థిరమైన ప్రభుత్వంకాదని, మిత్రపక్షాలపై ఆధారపడిన ప్రభుత్వమన్నారు.

ALSO READ: ఘల్లు మంది గ్లాసు.. మ్యాచ్ రోజు మునిగి తేలారు

17వ లోక్‌సభ చివరిలో డబ్బులు తీసుకుని సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణల నేపథ్యంలో ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు గురైంది. ఆ తర్వాత కొద్దినెలలకే సార్వత్రిక ఎన్నికల గంట మోగింది. అప్పటికే టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ ఆమెకి ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు. నిన్నటి ఎన్నికల్లో ఆమె విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News