Big Stories

Monsoon: నైరుతి ఆలస్యం.. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై ప్రభావం!

monsoon 2023

Monsoon: కేరళ తీరాన్ని ఇప్పటికే తాకాల్సిన నైరుతి రుతుపవనాల రాక ఇంకాస్త ఆలస్యం కానుంది. మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళ తీరాన్ని తాకి దేశమంతటా విస్తరించడంతో వానలు కురుస్తాయి. ఒక్కో ఏడాది వాతావరణ పరిస్థితులను బట్టి రుతుపవనాల రాక వారం దాకా లేటవుతుంటుంది. గత అంచనాల ప్రకారం జూన్‌ 4 కల్లా రుతుపవనాలు కేరళకు రావాల్సింది. కానీ రాలేదు. మరో మూడు నాలుగు రోజుల్లో తాకుతాయని అంచనా వేస్తున్నా.. కచ్చితమైన తేదీ చెప్పలేమంటున్నారు వెదర్ ఆఫీసర్లు.

- Advertisement -

నైరుతి రుతుపవనాల రాకకు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పశ్చిమం నుంచి వస్తున్న గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలంగానే వీస్తున్నాయంటున్నారు. ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉందని, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నా.. పరిస్థితులను బట్టి ఈ మార్పులు జరగనున్నాయి. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భారత వాతావరణ శాఖ అంటోంది. సైక్లోనిక్ సర్క్యులేషన్ కారణంగా మేఘాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కేరళ తీరం వైపు వెళ్లే అవకాశాలపై ప్రభావం పడనుందని అంటున్నారు.

- Advertisement -

భారత ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. సాధారణంగా రుతుపవనాలు ఏటా జూన్‌ 1న కేరళలోకి ప్రవేశిస్తాయి. గతేడాది మే 29 కేరళ తీరాన్ని తాకకగా.. 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న, 2019లో జూన్‌ 8, 2018లో మే 29న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా నైరుతి రుతుపవనాల సమయంలో భారత్‌లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇంతకు ముందు తెలిపింది. భారత్ లో 52శాతం సాగు విస్తీర్ణం రుతుపవన వర్షపాతంపై ఆధారపడి ఉన్నాయి. విద్యుత్‌ ఉత్పత్తితో పాటు తాగునీటికి సైతం రుతుపవనాలే ఆధారం. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఈ నైరుతి రుతుపవనాలే కీలకం.

రుతుపవనాలు ఆలస్యమైతే… విత్తనాలు విత్తుకోవడం ఆలస్యమవుతుంది. వరి, పత్తి, మొక్కజొన్న, చెరుకు పంటల దిగుబడులు లేటవుతాయి. ఈసారి జూన్ లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఎందుకంటే కేరళ తీరాన్ని తాకాలి… అక్కడి నుంచి దేశమంతా విస్తరించాలి, ఇందుకు టైం తీసుకుంటుందని చెబుతున్నారు. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ లో రుతుపవనాలు ఊపందుకోనున్నాయి. స్ట్రాంగ్ ఎల్ నినో వెదర్ కండీషన్స్ తో 2014, 2015లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరిప్పుడు సాధారణ వర్షపాతమే ఉంటుందని IMD అంచనా వేస్తున్నా.. రుతుపవనాల రాకపై రైతుల్లో టెన్షన్ కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News