Big Stories

Modi Call to Some MP’s: కాబోయే మంత్రులతో మోదీ భేటీ, కీలక సూచనలు.. బీజేపీకి-35, మిత్రులు-11, జనసేనకు హ్యాండ్..!

Modi Call to Some MP’s: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈసారి కొత్తగా ఎంపికైన కొందరు ఎంపీలతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం కానున్నారు.

- Advertisement -

ఉదయం పదకొండున్నర గంటలకు కొత్తగా ఎంపికైన కొందరితో ప్రధాని మోదీ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. వారిని కేబినెట్‌లోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీటింగ్‌కు హాజరయ్యే వారిలో కొంతమంది పాతవారు, మరికొందరు కొత్తగా ఎన్నికైన ఎంపీలున్నారు.

- Advertisement -

బీజేపీ నుంచి ఎంపికైన ఎంపీల్లో ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. కేబినెట్‌లో తీసుకోబోయేవారికి ముందు గానే పార్టీ హైకమాండ్ ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా అన్నారా అన్నదే అసలు పాయింట్. కాకపోతే తెలంగాణ, ఏపీ నుంచి గెలిచివారు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.

Also Read: ముచ్చటగా మూడోసారి.. మోదీ 3.0 ఎలా ఉండబోతోంది?

బీజేపీ నుంచి అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, పియూష్‌ గోయల్, రవిశంకర్ ప్రసాద్‌తోపాటు వెస్ట్ ఢిల్లీ నుంచి గెలుపొందని కమల్‌జీత్‌, జ్యోతిరాధిత్య సింధియా, జయంత్ చౌదరి, మాన్‌సుఖ్ మాండవీయ, అశ్వినివైభవ్, నిర్మలాసీతారామన్, తమిళనాడు నుంచి అన్నామలైతోపాటు మరికొందరు ఎంపీలున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు జోరందుకున్నాయి. ఎల్జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్, జేడీ ఎస్ నుంచి కుమారస్వామి, ఎన్‌సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ ఉన్నారు. అయితే జనసేనకు మోదీ కేబినెట్‌లో చోటు లేదని సమాచారం. ఇక బీజేపీ వద్ద ఉండాల్సి శాఖల్లో హోం, ఆర్థిక, రక్షణ, సమాచార, ప్రసారశాఖ, పార్లమెంటరీ వ్యవహారాలు, హెచ్ఆర్డీ ఉండనున్నాయి.

టీడీపీ నుంచి ముగ్గురికి, జేడీయూ నుంచి ఇద్దరు, శివసేన (షిండే గ్రూప్), ఎల్జేపీ నుంచి ఒకొక్కర్ని కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా వారణాసికి వెళ్లనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News