Big Stories

PM Modi 3.0: వాజ్‌పేయ్ గవర్నమెంట్ పడిపోడానికి కారణమేంటో తెలుసా..? మరోసారి మోదీ ఆ సాహసం చేస్తారా?

Modi 3.0 Focus on Speaker Post Keeping 1999 in Mind: లోక్ సభ స్పీకర్.. ఈ పదవి పార్లమెంట్‌లో బిల్లులు పాస్ అవ్వాలన్నా.. ప్రభుత్వానిక సంబంధించిన పరిపాలనా చట్టాలను రూపొందించాలన్నా ఈ పదవి చాలా కీలకం. ఎంత కీలకం అంటే లోక్ సభ స్పీకర్ చర్యలు ఒక్కోసారి ప్రభుత్వాన్ని పడగొట్టినా ఆశ్చర్యపోనంతగా. ప్రస్తుతం కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది.

- Advertisement -

బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ, ఎన్సీపీ వంటి పార్టీలతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పలు కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ఎన్డీయే కూటమి భాగస్వాములకు మంత్రి పదవులను కేటాయించింది. కూటమిలోని ఇతర పార్టీలకు ఆయా పార్టీల విన్నపాల మేరకు, అలాగే పలు రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవులను కేటాయించింది.

- Advertisement -

అయితే ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రధాన అంశం లోక్ సభ స్పీకర్ ఎన్నిక. ఇప్పుడు కేంద్రంలో 1999లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన సన్నివేశం కనిపిస్తోంది. అసలు 1999లో ఏం జరిగింది..?

Also Read: Parliament Sessions: జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు: కిరణ్ రిజిజు

1999 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎన్డీయే కూటమి, తెలుగుదేశం పార్టీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీయే కూటమికి 269 ఎంపీలు ఉండగా.. తెలుగుదేశం పార్టీకి 29 ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోరిక మేరకు లోక్ సభ స్పీకర్ పదవి ఆ పార్టీకి కేటాయించారు. దీంతో జీ ఎం సీ బాలయోగి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అయితే వాజ్‌పేయి ప్రభుత్వంపై అనధికాలంలోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి ప్రతిపక్ష పార్టీలు.

అవిశ్వాస తీర్మనంపై ఓటింగ్ నిర్వహించగా ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా.. ప్రతికూలంగా 270 ఓట్లు వచ్చాయి. దీంతో స్పీకర్ ఓటు కీలకంగా మారింది. కానీ లోక్ సభ స్పీకర్ బాలయోగి తన విచక్షణాధికారం ఉపయోగించి ఒడిశా కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్‌ను ఓటు వేయడానికి అనుమతించారు.

Also Read: తదుపరి లోక్‌సభ స్పీకర్ ఎవరంటే..?

అయితే అప్పటికే గమాంగ్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. ఇక్కడ స్పీకర్ విచక్షణాధికారం వాజ్‌పేయి ప్రభుత్వ విధిని నిర్ణయించింది. స్పీకర్ ఓటు కాదు, ఆయన నిర్ణయమే ప్రభుత్వం కుప్పకూలేలా చేసింది.

ఇక 2024లో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సారి కూడా టీడీపీ లోక్ సభ స్పీకర్ పదవి కోరినట్లు సమాచారం.

1999లో స్పీకర్ పదవిని ఇచ్చి మొదటికే మోసం తెచ్చుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. మళ్లీ ఇప్పుడు ఆ సాహసం చేస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News