Big Stories

MK Stalin: నీట్ రద్దు చేయండి.. ప్రధాని, 8 మంది సీఎంలకు స్టాలిన్ లేఖ

MK Stalin on NEET Row: దేశ వ్యాప్తంగా నీట్, యూజీసీ నెట్ పరీక్షల అవకతకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. ప్రధాని మోదీతో పాటు ఎనిమిది మంది సీఎంలకు లేఖ రాశారు. వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్) విధానాన్ని రద్దు చేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో పాటు ఎనిమిది మంది సీఎంలకు లేఖ రాశారు.

- Advertisement -

నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. వృత్తిపరమైన కోర్సుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 12వ తరగతి మార్కుల ద్వారా మాత్రమే ఉండాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలిపారు. నీట్.. విద్యార్థులపై అనవసర ఒత్తిడి అని ఆరోపించారు. అంతే కాకుండా నీట్ పరీక్ష రద్దు చేయడంపై ఇతర రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్ల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలని వెల్లడించారు.

- Advertisement -

Also Read: యూజీసీ నెట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ

మరో వైపు నీట్ రద్దు కోసం అసెంబ్లీలో ఇదే విధమైన తీర్మానాన్ని పరిశీలించాలని ఎనిమిది రాష్ట్రాల సీఎంలను స్టాలిన్ కోరారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక సీఎంలకు ఈ మేరకు లేఖలు పంపారు. అలాగే నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాంగ్‌కు కూడా మద్దతు ఇవ్వాలని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News