Big Stories

Militants Attack on Army Outpost: జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు, ఏం జరుగుతోంది..?

Militants attack on Army outpost in Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి.  వరుసగా మూడురోజుల్లో మూడు ఉగ్రదాడులు జరగడంతో భద్రతా బలగాలు షాకవుతున్నాయి. అసలు జమ్మూకాశ్మీర్‌లో ఏం జరుగుతోందన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.

- Advertisement -

తాజాగా బుధవారం దోడా జిల్లాలో ఆర్మీకి చెందిన తాత్కాలిక స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దాడి వెనుక ఉన్నది తామేనని ప్రకటించింది కాశ్మీర్ టైగర్స్ గ్రూప్. కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

పూంఛ్, రాజౌరీ ప్రాంతాలతో పోలిస్తే రియాసీలో ఉగ్ర ఘటనల తీవ్రత తక్కువగా ఉందని అంటున్నాయి భద్రతా బలగాలు. అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజా విసరడం కాస్త ఆందోళనగా ఉందని అంటున్నాయి. ఇటీవల కథువా జిల్లాలో ఓ ఇంటిపై ఉగ్రమూకలు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఈ ఘటన అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని హీరానగర్ సెక్టార్‌లో చోటు చేసుకుంది.

Also Read: వీఐపీల భద్రతలో మార్పులు, ఎన్ఎస్‌జీని తప్పించి.. ఆ స్థానంలో

ఇక జూన్ 9న రైసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. దాడుల నేపథ్యంలో బస్సు లోయలో పడిపోయింది. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు కాల్పులు కంటిన్యూ చేశారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఇలా వరుసగా ఉగ్రవాదులు చెలరేగిపోవడంతో భద్రత బలగాలు అంతుబట్టడం లేదు. ఇన్నాళ్లు వీరంతా ఎక్కడున్నారు? లేక సరిహద్దులను దాటి వస్తున్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News