BigTV English

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్..మనీష్ సిసోడియా అరెస్ట్..

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్..మనీష్ సిసోడియా అరెస్ట్..

Manish Sisodia: ఢిల్లీ మద్యం స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ కు ముందు 8 గంటలపాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.


నిబంధనలకు విరుద్ధంగా మద్యం టెండర్లు కట్టబెట్టారని సిసోడియాపై ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో సీబీఐ, ఈడీ కలిపి మొత్తం 12 మందిని అరెస్ట్ చేశాయి. విజయ నాయర్ , అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరా, రాజేష్ జోషి, బుచ్చిబాబు, బినొయ్ బాబు, గౌతమ్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.

సీబీఐ విచారణకు ముందు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నానని ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కొన్నాళ్లు జైలులోనే ఉండాల్సి వచ్చినా.. తాను లెక్కచేయనని స్పష్టం చేశారు. తాను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తినని సిసోడియా ట్వీట్ చేయడం సంచలన రేపింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్న సమయంలో అరెస్ట్ పై వార్తలు గుప్పుమన్నాయి. సిసోడియా ఊహించిన విధంగా సీబీఐ అధికారులను అరెస్ట్ చేశారు. ఆయనను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని రోజులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.


Rahul Gandhi : భారత్ జోడో యాత్ర 2.0.. ర్యూట్ మ్యాప్ ఇలా..!

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సిసోడియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×