BigTV English

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సిసోడియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సిసోడియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Manish Sisodia : ఢిల్లీ మద్యం స్కామ్ లో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను ఆదివారం రాత్రంతా సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో ఆయను ప్రవేశ పెట్టనున్నారు. సిసోడియా అరెస్ట్ పై సీబీఐ కీలక విషయాలను వెల్లడించింది. ఆయన విచారణకు సహకరించకపోవడం వల్లే అరెస్టు చేశామని వెల్లడించింది. కీలకమైన అంశాలపై సరిగా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. తప్పించుకునే విధంగా సమాధానాలు ఇచ్చారని పేర్కొంది. సిసోడియా దర్యాప్తునకు సహకరించలేదని ఆరోపించింది.


ఢిల్లీ మధ్య స్కామ్ లో సిసోడియా నుంచి రాబట్టాల్సిన సమాచారం చాలా ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీబీఐ అధికారులు కోరనున్నారు. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సిసోడియా పేరు ఉందని తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

సిసోడియా ఫోన్ల వాడకంపైనా సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. ఇతర వ్యక్తుల పేర్లపై ఫోన్‌ నంబర్లు, ఫోన్లు తీసుకున్నారని ప్రకటించింది. వాటిలో కొన్ని ఫోన్లు ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. సిసోడియా 18 ఫోన్లు, నాలుగు ఫోన్‌ నంబర్లు ఉపయోగించేవారని తెలిపింది. ఒక్క రోజులోనే మూడు ఫోన్లను మార్చినట్లు నిర్ధారించింది.


మరోవైపు సిసోడియా అరెస్ట్ కు నిరసనగా ఆప్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. అటు సీబీఐ కార్యాలయం ముందు జాగ్రత్తగా భద్రతను పెంచారు.

Rahul Gandhi : భారత్ జోడో యాత్ర 2.0.. ర్యూట్ మ్యాప్ ఇలా..!

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్..మనీష్ సిసోడియా అరెస్ట్..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×