Big Stories

Wife demands half his company: ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉండమన్న భర్తకు షాకిచ్చిన భార్య.. చివరకు..

Wife demands half his company: ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామాకు సంబంధించి.. ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాను  తీసుకున్న నిర్ణయం విషయంలో తనకు కొంత ఆందోళనగా ఉందంటూ తెలియజేస్తూ మీ సలహాలు ఇవ్వండంటూ నెటిజన్స్ ను కోరుతూ అందులో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్ చేశారు. చివరకు ఆమె ప్రయత్నం ఫలించింది. దీంతో ఆమె నెటిజన్స్ కు థ్యాంక్స్ చెప్పింది. ఇప్పుడు దీనిపై భారీ చర్చ నడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

- Advertisement -

ఆమె ఒక విద్యావంతురాలు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాన్ని కొనసాగిస్తుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఓ కంపెనీని రన్ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ఉద్యోగంలో నిమగ్నమవ్వడంతో పిల్లలు బాగోగులు చూసుకునేవారు లేరు. దీంతో ఆమెకు తన భర్త సలహా ఇచ్చాడు. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకోమన్నాడు. అయితే, ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన భర్త ఉద్యోగం మానేయమంటున్నాడని.. తనకు ఏం చేయాలో అర్థం కావాట్లేదని.. ఈ క్రమంలోనే ఓ డిమాండ్ ను తన భర్త ముందుంచినట్లు ఆమె అందులో పేర్కొన్నారు. ఇది కరెక్టేనా అంటూ నెటిజన్స్ ను అడిగింది.

- Advertisement -

సదరు మహిళ Reddit లో పెట్టిన పోస్ట్ లో ఇలా పేర్కొన్నది..”నేను, నా భర్త వివాహం చేసుకుని ఆరు ఏళ్లు గడుస్తున్నది. మాకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం నేను గర్భిణీని. పిల్లల బాగోగులు చూసుకోవాలంటే నేను ఉద్యోగం మానేసి పిల్లలను చూసుకొమ్మంటూ మా ఆయన నాతో చెప్పారు. ఎందుకో ఆ మాట వల్ల నేను బాగా కుంగిపోయాను. ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం అది. ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని వదులుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు.. కానీ, భవిష్యత్ లో అనుకోని పరిస్థితుల్లో మేము విడాకులు తీసుకోవాల్సి వస్తే నాకు ఏ ఆధారం ఉండదు కదా.

Also Read: పార్లమెంటులో రాహుల్ గాంధీ మైక్‌ను మ్యూట్ చేస్తున్నారు: కాంగ్రెస్

అందుకే ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. చివరకు ఓ నిర్ణయం తీసుకున్నా. నా భర్త కంపెనీలో సగం వాటాను నాకు ఇవ్వమన్నాను. అలా ఇస్తేనే ఉద్యోగం మానేస్తానని చెప్పాను. ఇది విన్న మా ఆయన ఆశ్చర్యపోయారు. నా స్నేహితులకు ఈ విషయం చెప్పినప్పుడు నాపై కొంత అసహనం వ్యక్తం చేశారు. ‘భర్తతో ఈ విధంగా ప్రవర్తిస్తావా.. ఇదేం పిచ్చి ప్రవర్తన?’ అంటూ మందలించారు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా..? లేక నా నిర్ణయం సరైనదేనా? అని నేను తేల్చుకోలేకపోతున్నాను. నాకు మీ సలహా కావాలి” అంటూ ఆమె నెటిజన్లను కోరింది.

అయితే, దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘ఆర్థిక భరోసా, సురక్షితమైన భవిష్యత్తు మీ ఆయనకు ఎలాగైతే ముఖ్యమో.. మీకు కూడా అంతే అవసరం. ఇంట్లోని తన బాధ్యతలను కూడా మీపై వేయాలని చూస్తున్నారు. మీరు వాటా అడిగి మంచి పని చేశారు. మీ నిర్ణయం సరైందే. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా భవిష్యత్ లో ఏదైనా జరగరానిది జరిగితే మీకంటూ ఓ ఆధారం ఉంటుది కదా. అందుకే మీరు వాటా కోరడం కరెక్టే’ అంటూ రకరకాలుగా నెటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఆమెకు అండగా ఉన్నారు. పిల్లల బాధ్యతను తల్లి చూసుకోవాలంటే ఇటువంటివి తప్పవంటూ మరికొంతమంది హితవు పలికారు.

Also Read: పార్లమెంటులో స్లోగన్స్‌పై స్పందించిన ప్రియాంక గాంధీ

ఇదిలా ఉంటే.. మరో పోస్ట్ లో ఆ మహిళ శుభవార్త చెప్పింది. తాను కోరుకున్నట్లుగా తన భర్త కంపెనీలో 49 శాతం వాటా ఇచ్చారంటూ అందులో పేర్కొన్నది. ఈ విషయంలో తనకు మద్దతుగా ఉన్న నెటిజన్లకు ఆమె థ్యాంక్స్ చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News