Big Stories

Bengal Man thrashing woman publicly: పశ్చిమబెంగాల్‌లో ఘోరం.. మహిళను ఇష్టమొచ్చినట్టు కొడుతున్న వీడియో వైరల్

Bengal Man thrashing woman publicly in West Bengal: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ మహిళతోపాటు మరో వ్యక్తిని.. ఓ వ్యక్తి ఇష్టంవచ్చినట్టు కొడుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తుంది. కనీసం కనికరం చూపకుండా వారిని పశువులను బాదినట్లు బాదుతున్నాడు. అక్కడ జనం గుమిగూడి చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వారిని ఆపే ప్రయత్నం చేయడం లేదు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దీదీ.. మీకు ఈ ఘోరం కనిపించడేలదా..? ఇదేనా మీ పాలన? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

- Advertisement -

నార్త్ బెంగాల్‌లోని ఉత్తర్ దీనాజ్‌పుర్ జిల్లాలోని చోప్రా ప్రాంతంలో రెండుమూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. వీడియోను పరిశీలిస్తే.. కొంతమంది జనం అక్కడ గుమిగూడగా ఇద్దరిని ఓ వ్యక్తి కర్రతో కిరాతకంగా కొడుతున్నాడు. కొట్టిన దెబ్బలకు కర్ర కూడా విరిగిపోయింది. అయినా కూడా వారిని వదలకుండా బాదాడు. ఇంత జరుగుతున్నా అక్కడున్నవారు ఏ మాత్రం ఆపే ప్రయత్నం చేయలేదు. మరింత కొట్టేలా అతడిని ప్రేరేపించారు. ఒక దశలో ఆ వ్యక్తి మహిళ జుట్టు పట్టుకుని ఇష్టమొచ్చినట్లు తన్నిన దృశ్యం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది.

- Advertisement -

ఈ ఘటనపై బీజేపీ మండిపడింది. బెంగాల్ లో మమతా బెనర్జీ పాలనకు ఇదే నిదర్శనం అంటూ బీజేపీ నేత అమిత్ మాలవ్యా సోషల్ మీడియా(ఎక్స్)లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో అమలవుతున్న చట్టాల గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలన్నారు. ‘రాష్ట్రంలో ఇదొక్క ఘటనే కాదు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. సందేశ్ ఖాళీ లాంటి గ్రామాలెన్నో ఉన్నాయి. సీఎం మమతా బెనర్జీ.. మహిళలు శాపంగా మారారు. పశ్చిమబెగాల్ లో శాంతిభద్రతలు కొరవడ్డాయి. ఇలాంటి వ్యక్తిపై సీఎం చర్యలు తీసుకుంటారా? లేదా? షాజహాన్ షేక్ కు అండగా నిలిచినట్లు ఇతడిని కూడా సమర్థిస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

అయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖాళీ గ్రామం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అక్కడ పంచాయతీ పెద్ద, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ మహిళలను లైంగికంగా వేధించేవాడని, రేషన్ దుకాణా(పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన ఆహార ధాన్యాలను పెద్ద ఎత్తున అక్రమంగా తరలించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

Also Read: వీళ్లిద్దరు చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు దేశ అత్యున్నత అధికారులు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం కూడా సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. కంగారూ కోర్టులో కూడా విచారణ చేసిన తరువాతనే శిక్ష విధిస్తారు.. కానీ, మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పాలనలో మాత్రం యూపీలో మాదిరిగా బుల్డోజర్ న్యాయం అమలవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా ఇంటి నుంచి బహిష్కరించారంటే బెంగాల్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవొచ్చన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితం కావడంపై ఆయన పెదవి విరిచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News